ఖజానా కార్యాలయాల్లో ఆమోదం పొంది ఆర్థిక శాఖ వద్ద రెండేళ్ళుగా పెండింగులో ఉన్న మెడికల్ రీయింబర్స్ మెంట్, జిపిఎఫ్, టిఎస్ జిఎల్‌ఐ, పిఆర్సీ, డిఎ బకాయిలు, సప్లిమెంటరీ జీతాలు, పెన్షన్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. టిఎస్ యుటిఎఫ్ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో కె జంగయ్య అధ్యక్షతన జరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి చెందిన బిల్లులు మంజూరు…
ప్రధాని మోడీ రేపు, ఎల్లుండి తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే.. ప్రధాని మోడీకి తెలంగాణ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను బీజేపీ విడుదల చేసింది. రేపు ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు అదిలాబాద్‌లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవం లో పాల్గొననున్న మోడీ….11.15 గంటల నుండి 12 గంటల వరకు పబ్లిక్ మీటింగ్ ప్రధాని మోడీ పాల్గొంటారు. మధ్యాహ్నం తమిళ్ నాడు వెళ్లి.. తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు రాత్రి రాజ్…
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఖరారు చేసే పనిలో పడ్డారు ఆయా పార్టీల అధిష్టానం పెద్దలు. నిన్న బీజేపీ అధిష్టానం 195 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. దీంతో పాటు.. తెలంగాణలోనూ పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేస్తూ పేర్లను ప్రకటించింది. అయితే.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో సీట్లు గెలిచేందుకు బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో…
పెళ్లి జరుగుతున్న అమ్మాయి సోదరుడు గతంలో తమ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళాడని ఆరోపణలతో తాజాగా పెళ్లి మండపంలోకి వెళ్లి గొడవ చేసిన ఘటన ఇది. పెళ్లి మంటపంలో అమ్మాయి పెళ్లి జరగకుండా చేయడానికి ఒక వర్గం వారు ప్రయత్నాలు చేయడంతో పెళ్లికూతురు పెళ్లి నీ అడ్డు కునేందుకు యత్నం చేశారు..దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి యువకులని చెదరగొట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. Pawan Singh: బీజేపీకి షాక్ ఇచ్చిన భోజ్‌పురి నటుడు.. ఇది…
ఆదిలాబాద్ నియోజకవర్గానికి 3500 ఇళ్లు నిరుపేదలకు అందించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ అంటేనే గ్యారంటీలకు గ్యారెంటీ అన్నారు. ధరణితో దొరలకే లబ్దిచేకురిందన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ కు వారెంట్ లేదన్న బీఆర్ఎస్ఎటు పోయిందన్నారు. పేదలకు కట్టిన ఇల్లు ఇవ్వని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. సొంత ఆస్తులు పెంచుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. గత ప్రభుత్వాలు జిల్లాకు అన్యాయం చేశాయన్నారు. చట్టాలను…
అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఎన్హెచ్ఎఫ్ఎస్ వెల్లడించిన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ఆరోగ్య ప్రమాణాలు పెరగాల్సింది పోయి, దిగజారటం సరైంది కాదని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా.. లేదా పక్కాగా అధికారులు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. కేవలం…
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ కుమార్ పేరును జాతీయ నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు. నా జీవితం కరీంనగర్ ప్రజలకే అంకితమన్నారు బండి సంజయ్. బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్ధిగా తనని ప్రకటించినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మీరు గర్వపడేలా పోరాటాలు చేసిన.. కరీంనగర్ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడతా అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ నుండి భారీ మెజారిటీ గెలిపించి సత్తా చాటండని, కేంద్రం నుండి…
రవీంద్రభారతిలో దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హాజరైన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు సీఎం, మంత్రులు. రవీంద్రభారతి ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు ఫోటో ఎగ్జిబిషన్…
ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మరో గ్యారెంటీ పై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇండ్ల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం పై కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇండ్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారో.. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో…