రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్ధిగా ఈటల రాజేందర్ పేరును అధినాయకత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈటలకి అభిమానుల తాకిడి ఎక్కువ అయ్యింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఈటల అభిమానులతో షామీర్ పేటలోని ఈటల నివాసం సందడిగా మారింది. పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందనలు తెలిపారు. ఈ సారి గెలుపు మీదే అంటూ భరోసా ఇచ్చారు. శాలువాలు కప్పి సత్కరించారు. మోదీ గారినీ ప్రధానమంత్రిని చేసేందుకు మల్కాజ్గిరి నుండి ఈటలను గెలిపించే భాద్యత తమ భుజస్కందాలమీద వేసుకుంటామని పలువురు హామీ ఇచ్చారు. నిజాయితీ, నిబద్ధతకు మారు పేరైన ఈటలలాంటి నాయకుణ్ణి ఎంపీ అభ్యర్థిగా ఇచ్చినందుకు నరేంద్రమోదీ గారికి, బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం వరకు దాదాపు మూడు వేలకు పైగా అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ నరేంద్రుడు, ఇక్కడ రాజేంద్రుడు అంటూ నినాదాలు చేసారు.