రాష్ట్రoలోని ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల కోసం ముడి పామాయిల్ ధరలు స్థిరీకరించానికి ముడి పామాయిల్ దిగుమతి పై సుంకాలని విధించి పామాయిల్ గెలలకు లాభదాయకమైన ధరలను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి భారత ప్రభుత్వం 1992 నుండి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్ పామ్ సాగు అభివృద్దిని ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతము, రాష్ట్రంలో ఆయిల్ పామ్…
యాదాద్రి కాదు ఇకపై యాదగిరి గుట్టనే అని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీఓ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు అంటూ సెటైర్లు వేశారు కోమటిరెడ్డి. నేను ఉద్యమాలు చేసి వచ్చానని, నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వేస్ట్ అంటూ చురకలు అంటించారు. Nitish Kumar: “ప్రధాని మోడీని…
గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటుచేసిన ఆర్జీయూకేటీ బాసర ఆశయం నెరవేరుతుంది. ఇక్కడ విద్యార్థులుగా చేర్చే తల్లితండ్రులు చిన్న, సన్న కారు రైతులుగా, కూలి పనులు, గుమాస్తాలు, చిరు ఉద్యోగాలు చేసుకుంటూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివి చదివించుకున్న వారే. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి బాసర క్యాంపస్ లో సీట్లు దక్కించుకొని ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి చదువు…
Breaking News: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వేగంగా ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ తన తొలి విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర నేతలు లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు.
కాళేశ్వరం పై ఆ రెండు పార్టీలు డ్రామా చేస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన ఆదిలాబాద్ లో ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు వద్దకు వారు పిక్ నిక్ కు వెల్తున్నారు..పోటీ పడి ఎమ్మెల్యేలను తీసుకోని టూర్లు వేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. వాళ్లంతా డ్రామా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై ఒక్క లేఖ ఇస్తే సీబీఐ రంగంలోకి దిగుతుందని, సీబీఐకి ఇవ్వండి ..ఎవ్వరి చిత్తశుద్ది ఏంటో బయటపడుతుంది…దోషులు ఎవ్వరో తేలుస్తారన్నారు.…
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తాగునీటి వనరులైనటువంటి రిజర్వాయర్ల వారీగా ప్రస్తుతం ఉన్న నీటి నిలువలపై సమక్షించారు. రిజర్వాయర్లు, నదుల వంటి తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రంలోని అన్ని మారుమూల గ్రామాలు, ఆవాసాలు, తండాలు, గుడాలకు ప్రతిరోజు తాగునీటి సరఫరా జరిగేలా చూడాలని మంత్రి ఇంజనీర్లను ఆదేశించారు. ప్రత్యేకంగా పూర్వపు అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని పంపుసెట్ల సమస్యను త్వరితంగా పరిష్కరించి వేసవిలో ఎటువంటి…
శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే మన అందరి జీవితాలు బాగుపడతాయి అనుకున్నామని, కానీ గత పది సంవత్సరాల్లో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందన్నారు. బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడ్డారని, ఆనాడు రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీలను పటిష్ట పరిస్తే ఇప్పుడు 10…
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ పర్యటనలో భాగంగా ఇవాళ అన్నారం బ్యారేజీ వద్ద బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పడగొట్టాలంటే కాళేశ్వరం పడగొడితే సరిపోతుంది అని రేవంత్ ఆలోచన లా కనిపిస్తుందన్నారు. అసలు కేసిఆర్ నే లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను…
పరకాలకు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కలిశారు. ఇటీవల పరకాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝాకు ఫోన్ చేసిన కేటీఆర్.. ఎస్ఐని సస్పెండ్ చేసి మిగతా అధికారులను కాపాడడం సరికాదన్నారు. పోలీసుల దాడిలో తీవ్ర గాయాలైన…
నిర్మల్‌లో గత పాలకుల పాపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మల్ లో ప్రభుత్వ భూములను గత పాలకులు అన్యాక్రాంతం చేశారన్నారు. గతంలో చెప్పినట్లుగా ఆధారాలతో సహా కలెక్టర్‌కి ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. వాస్తవాలను శేత్వార్ తో సహా పరిశీలించి అధికారులే విస్తుపోయారని, ప్రభుత్వ భూమిలోనే ప్రైవేట్ సంస్థ డీ మార్ట్ నిర్మాణం చేస్తున్నారన్నారు. సర్వే నెం. 256 ప్రభుత్వ భూమి, ఇందులో డీమార్ట్ కు…