రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, ముంబై మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఏర్పాట్లు, బందోబస్తు పై రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ.. 2500 మంది పోలీసులతో స్టేడియం చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్టేడియం చుట్టూ 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, స్టేడియం లోపల కంట్రోల్ రూం ఏర్పాటు.. ప్రత్యేక ఐటీ సెల్ టీమ్ మానిటరింగ్…
జగిత్యాల పట్టణం పద్మశాలి సంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీగా గెలిస్తే జగిత్యాల నుండి మంచిర్యాల మీదుగా ఢిల్లీకి రైల్వే లైను వేయిస్తానన్నారు. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం.. మంచంలో పడుకొనైనా ప్రజలకు అండగా నిలుస్తానన్నారు. బలహీన వర్గాలకు కేటాయించిన హక్కులు వారికే చెందేలాగా వారి హక్కులను కాపాడానని సంతృప్తి మిగిలిందని, నా ప్రతి విజయంలో…
తనపై వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొట్టిపారేశారు, తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. తనను అనవసరంగా తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ నుంచి మారాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, అయితే తనకు అలాంటి ఆలోచనే లేదని చెప్పారు. 2023 ఆగస్టులో తనను అక్రమంగా నిర్బంధించి, దాడి చేసి డబ్బులు వసూలు చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధా కిషన్రావు,…
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లాలో మాట్లాడుతూ.. నేను పార్టీ మారను. ఏ పార్టీలోకి వెళ్ళనని ఆయన క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారతాడని పలు పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయం నా వృత్తి, వైద్యం నా ప్రవృత్తి అని ఆయన తెలిపారు. వాళ్లు వీళ్లు పార్టీలు మారుతున్నట్టు నేను…
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు రావడం ఖాయమని, మోడీ ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టబోతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆయా కాలనీల్లో పర్యటించారు. అంబర్ ట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్, సత్యా నగర్, రత్న నగర్ లో, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని…
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షల ఎకరాల్లో పంటలకు నష్ట వాటిల్లింది. అయితే.. ఈ నేపథ్యంలోనే రంగంలోకి గులాబి బాస్ దిగనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాతల చెంతకు కేసీఆర్ రానున్నారని, ఎండిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో కేసీఆర్ పర్యటిస్తారని ఆయన తెలిపారు. Prakash…
కచ్చితంగా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన సంగారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో మెదక్ నుంచి పోటీ చేద్దామని సర్వేలు చేసుకుని BRS గెలుస్తుందని తెలిసి వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి రఘునందన్ పనిమంతుడు అయితే దుబ్బాకలో గెలిచేవాడు కదా అని ఆయన సెటైర్లు వేశారు. ముస్లింలకు కాంగ్రెస్ కేబినెట్లో మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ఆయన…
రాష్ట్ర ప్రజలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హోలి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హోలి పండుగను రాష్ట్ర ప్రజలు సోమవారం కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. హోలి పండుగ అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి సంతోషంగా సాగాలన్న సందేశాన్ని ఇస్తుందన్నారు. ఈ రంగుల వసంతోత్సవం ప్రజల్లో కొత్త…
ఎక్కడికెళ్లినా అందరి నోట ఒకటే మాట… మోడీ కే మా ఓటు.. గ్రామాల్లో ముసలి వాళ్ళు సైతం మోడీ కే ఓటు అంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ కి ఓటు వేసుకున్న ఈ ఎన్నికల్లో మోడీ కే వేస్తామని అంటున్నారని, తెలంగాణలో బీజేపీ 12 నుండి 15 స్థానాలు గెలుస్తుందన్నారు. 6 గ్యారంటీ లు అమలు కావాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అంటున్నారు…