కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయి.. ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. శనివారం సాయంత్రం సచివాలయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన చర్చలు జరిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం వెంట ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ…
మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశాన్ని మోడీ నిలిపారన్నారు. 400 సీట్లు NDA కు వచ్చే వాతావరణం ఉందని, మంచి మెజార్టీతో ఎంపీగా ఆరూరి రమేష్ గెలవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అని కిషన్ రెడ్డి అన్నారు. హమీలు నెరవేర్చలేని…
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమ ఆకాంక్షలను రాష్ట్ర నామకరణం ప్రతిబింబించేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. విధాన పత్రాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, నివేదికలు , ఇతర కమ్యూనికేషన్ మెటీరియల్‌లతో సహా అన్ని అధికారిక పత్రాలు ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాల యొక్క అన్ని అధికారిక కమ్యూనికేషన్లలో TSకి బదులుగా TG నామకరణాన్ని ఉపయోగిస్తాయి. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర సంస్థలు, స్వయంప్రతిపత్త సంస్థలు…
ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో తెలంగాణలో హైదరాబాద్ సహా పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్‌లో మరికాసేపట్లో జడివాన కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ హెచ్చరించింది. రాబోయే 3 గంటల పాటు హైదరాబాద్ లో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వికారాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అంతేకాకుండా… రెండు రోజులుగా కురుస్తున్న వానలతో వరి పంట నీట మునిగింది. మెదక్, సంగారెడ్డి…
పౌరసరఫరాల శాఖలో గ్లోబల్ టెండర్ల పేరిట అక్రమాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ చేతి వాటం ఈ టెండర్ల లో స్పష్టంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేరుకు పోయిన ధాన్యాన్ని వేలం వేయడానికి పిలిచిన టెండర్లలో జరిగిన అక్రమాల్లో సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ల ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి…
మద్యం షాప్ లో బీరు అడిగినందుకు ఓ యువకుడిని చావగొట్టారు వైన్స్ షాపు నిర్వాహకులు. ఈ దాడిలోగాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది . అడ్డాకుల మండలం బలీద్‌పల్లి చెందిన శ్రీ కాంత్ (26) గత నెల 26న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని బండమీదిపల్లిలో ఉన్న శ్రీమల్లికార్జున వైన్స్ వద్దకు వెళ్లి బీర్ కావాలని షాప్ నిర్వాహకులను అడిగాడు. అయితే బీర్ల షాటేజ్ కారణంగా ఎక్స్ట్రా రేట్ కు విక్రయిస్తున్న…
ఏపీలో పోలింగ్ అనంతరం కొన్న చోట్ల అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలింగ్ తర్వాత అలర్ల ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 7కు పైగా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇరు పార్టీలలో 40 మందికి పైగా ముద్దాయిలను గుర్తించారు పోలీసులు… పులివర్తి నానిపై దాడి కేసులో ఇప్పటికే 13మందిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పోలింగ్ రోజు బ్రాహ్మణ కాల్వలో బీఎస్ఎఫ్…
నటుడు-రాజకీయ నాయకుడు నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యక్తి. అయితే.. ఇటీవల ఏపీ ఎన్నికల అనంతరం ఆయన చేసిన ట్వీట్ ఇటు ఏపీ రాజకీయాల్లోనే కాకుండా.. అభిమానుల్లోనూ గందరగోళాన్ని రేకెత్తించింది. ఈ ట్వీట్ సమయం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కారణంగా చాలా వివాదాస్పదంగా మారింది. తాజా పరిణామంలో, నాగబాబు తన ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేసారు.. అల్లు అర్జున్ అభిమానుల నుండి ఘాటైన వ్యాఖ్యల వరద కారణంగా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నుండి ఎమ్మెల్యే…
తెలంగాణలో మళ్లీ ఉద్యమించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటున్న రాష్ట్రం మరోసారి ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో ‘సన్ ఆఫ్ ద సాయిల్’ (భూమిపుత్రుడు) పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ రాసిన ఈ పుస్తకం రాజకీయ, సామాజిక మార్పులు, రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ ఆయన రాసిన వార్తా కథనాల సంకలనం. తెలంగాణ ఉద్యమాన్ని, అభివృద్ధిని సరళంగా, అర్థమయ్యే…
6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ ప్రజలను అడుగడుగునా మోసం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేటి వరకు వాటి అమలు విషయానికి వచ్చే సరికి దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోంది. డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులైనా 6 గ్యారంటీలను అమలు చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల సాకు చూపి దాటవేత ధోరణిని ప్రదర్శించింది. ప్రస్తుతం పార్లమెంట్…