తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇబ్బంది లేకుండా సాఫీగా కొనుగోళ్లు జరిగేందుకు జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని, రేపటి నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రతి రోజు ఎక్కడో ఒకచోట కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని సూచించింది. ఎక్కడ రైతులకు ఇబ్బంది తలెత్తినా, కొనుగోళ్ల ప్రక్రియకు అడ్డంకులు ఎదురైనా వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లు నిర్వహించాలని, అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని…
కిర్గిజిస్తాన్ లోని బిష్కెక్లో భారతీయ విద్యార్థులపై దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని మరియు తెలంగాణ విద్యార్థులకు అవసరమైన సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతీయ విద్యార్థులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక విద్యార్థులకు మరియు ఈజిప్టు విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ తరువాత, బిష్కెక్లో హింస చెలరేగడంతో భారతీయ విద్యార్థులపై స్థానికులు దాడులకు దారితీసింది. ఈ దాడులకు సంబంధించిన అనేక వీడియోలు…
ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో పిడుగు దాటికి తాండూరు పట్టణంలోని పాత తాండూరులో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే తాండూర్ నియోజకవర్గంలో వరుస పిడుగుపాటులు పడడంతో వ్యక్తులు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు పిడుగుపాటుకు యాలాల మండలంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, 24 గంటలు గడవకముందే పిడుగుపాటుకు మరో వ్యక్తి బలయ్యాడు. పాత తాండూర్ సమీపంలో హోటల్ నిర్వహిస్తున్న శేఖర్ అనే వ్యక్తి కాలకృత్యాల…
దాచిన సొమ్ము దెయ్యాల పాలు చేసినట్లు.. కష్టపడి సంపాదించిన సొమ్మును కూడబెట్టుకునేందుకు చూస్తే.. అసలు పోయింది.. వడ్డీ పోయింది. మధ్యతరగతి కుటుంబాలు డబ్బును సంపాదించేందుకు ఎంత కష్టపడుతారో చెప్పనక్కర్లేదు. మధ్య తరగతి కుటుంబాలకు ఆఫర్ వచ్చిందంటే వస్తువులు కొనేస్తుంటారు. ఒక శాతం వడ్డీ ఎక్కువ ఇస్తామంటే.. ఆ బ్యాంకులోనే సేవింగ్స్ చేసుకుంటారు. అలాంటి ఏకంగా ఎక్కడ లేని విధంగా అధిక వడ్డీ ఇస్తామని చెబితే ఊరుకుంటారా.. ఇప్పుడూ అదే జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపెట్టి బిచాం…
మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది.. బత్తిని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని ఫ్యామిలీ సిద్ధమైంది. జూన్ 8న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబీకులచే వార్షిక ‘చేప ప్రసాదం’ ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ప్రతి సంవత్సరం, బత్తిని కుటుంబం ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే…
ఎన్నికలకు ముందు ప్రియాంక, రాహుల్, రేవంత్ ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన నల్లగొండ జిల్లా దేవరకొండలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు మూడు డీఏలు అన్నారు… ఒక్క డీఏ కూడా రిలీజ్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం… ఉద్యోగులను మోసం చేసిందన్నారు హరీష్ రావు. విద్యావంతులు, నిరుద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచన చేసి ఓటు వేయాలని, కాంగ్రెస్ కు ఓటేయడమంటే కాంగ్రెస్ మోసాన్ని బలపరిచినట్లవుతుందన్నారు హరీష్ రావు. ముప్పై…
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్దిష్ట షరతులతో చర్చించడానికి ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో అత్యవసర అంశాలను మాత్రమే ప్రస్తావించాలని ఈసీ షరతు విధించింది.
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో కూలిపోయినట్లు ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ కూడా తప్పిపోయారు.
కల్లాల వద్ద రైతుల కష్టాలు సర్కార్ కు పట్టవా? అన్ని రకాల వడ్లకు రూ.500ల బోనస్ ఇవ్వాల్సిందే అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో విపలమైన ప్రభుత్వం… పండించిన వడ్లను సైతం సకాలంలో కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తుండటంతో కొనుగోలు…
సీఎం రేవంత్ బిల్డింగ్ పర్మిషన్ కి SFT కి 75 రూపాయలు వసూలు చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇవాళ నల్లగొండలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ ఇచ్చిన హామీలు అమలు చేయలేరని, ఏదిపడితే అది చెప్పి తప్పించుకుంట అంటే ప్రజలు నీ భరతం పడతారని ఆయన వ్యాఖ్యానించారు. అతి తక్కువ కాలంలో ప్రజలచేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. కమీషన్ల దుకాణాలు ఓపెన్ చేశారని, ప్రభుత్వపరమైన ఆదాయాన్ని పెంచేదానికంటే వాళ్ళ…