ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్లు శాకంబరీ దేవీగా దర్శనం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారు జాము నుంచే భక్తులు భారీగా తరలి వస్తున్నారు.