మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి కోరిక మేరకు మార్చి తర్వత మేడ్చల్ మండలంలో రూ. 10 కోట్లతో మరో 50 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రిని మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి అనుబంధంగా మరో కోటి రూపాయలతో ఎస్ఎన్సీయూ కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఅర్…
చలో విజయవాడ లో భాగంగా సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట రామిరెడ్డి బైక్ పై విజయవాడ బయలుదేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. పే స్లిప్ లు చూస్తే గానీ సాలరీ పెరిగిందో తగ్గిందో తెలుసుకోలేని స్థితిలో ఉద్యోగులు లేరని, న్యాయబద్ధమైన హక్కు కోసం సమావేశం పెట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతోందని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాలకు అవసరమైన ఆందోళన చేసిన ఘటనలు చూశాం…
గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ అర్థరాత్రి ఒకటిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు. ఫోటోగ్రఫీ ద్వారా కల్చరల్ అంబాసిడర్ అఫ్ తెలంగాణగా ఎదిగిన భరత్ భూషణ్ వరంగల్ జిల్లాకు చెందినవారు. వరంగల్ లో గుడిమల్ల అనుసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించిన భరత్ భూషణ్ (66)ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చిన్ననాటినుంచే అటువైపు మళ్లారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్…
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కూడా పలుచోట్ల జోరు వాన కురిసింది. ఇలా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆదివారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లపైకే కాదు ఇళ్లలోకి కూడా నీరు చేరాయి. అంతేకాదు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలోకి కూడా వర్షపు నీరు చేరడంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్నటి నుంచి ఆగకుండా వర్షం కురుస్తుండటంతో ఆఫీసు అంతా మునిగి పోయి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.…
విజయనగరం మైన్స్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డికి ఆ శాఖ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బినామీ మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నారని ప్రతాప్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇటీవల ప్రతాప్ రెడ్డికి సంబంధించిన ఆడియో వైరల్ అవడంతో స్థానికంగా కలకలం రేగింది. అంతేకాకుండా ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మీడియా ముందుకు వచ్చిన ప్రతాప్ రెడ్డి.. గనుల శాఖలో కొందరు అధికారులు, మైనింగ్ మాఫియాతో చేతులు కలిపారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ప్రతాప్ రెడ్డిపై…
ఏపీలో పీఆర్సీపై రగడ జరుగుతోంది. ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగ సంఘాలు 11వ పీఆర్సీ కోసం క్షీరసాగర మదనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ సమీర్ శర్మపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ చేసిన కామెంట్లను ఐఏఎస్ అధికారుల సంఘం తప్పు పట్టింది. దీంతో ఏపీ ఐఏఎస్ అధికారుల అసోసియేషనుకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌంటర్ ఇచ్చింది. సీఎస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిలుకు ఛైర్మన్ హోదాలో సీఎస్ ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించాలని ఉద్యోగ సంఘాల…