Siliguri corridor: గతేడాది హింసాత్మక నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌కు తాత్కాలిక పాలకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటి నుంచి బంగ్లా ప్రభుత్వం భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తూనే ఉంది.
Asaduddin Owaisi Slams Pakistan PM: ఇస్లామాబాద్‌లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా భారత్‌పై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. తమకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా గుంజుకునేందుకూ భారత్‌కు అవకాశం ఇవ్వబోమన్నారు. నదీ జలాలను నిలిపివేసేందుకు తీసుకునే ఏ చర్య అయినా యుద్ధానికి కవ్వింపుగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
BrahMos: ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పూర్తిగా పాకిస్తాన్‌పై ఆధిపత్యం చెలాయించిందని యూఎస్ యుద్ధరంగ నిపుణుడు కల్నల్(రిటైర్డ్) జాన్ స్పెన్సర్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారతదేశం దాడి ,రక్షణాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని ఆయన అన్నారు. భారత్ పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశాన్ని అయినా ఎప్పుడైనా, ఎక్కడైనా ఢీకొనగలమనే సందేశాన్ని ఇచ్చిందని చెప్పారు. పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారతదేశ బ్రహ్మోస్ క్షిపణులను తట్టుకోలేదని ఆయన చెప్పారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ తన త్రివిధ దళాల శక్తిని పాకిస్తాన్‌కి రుచిచూపించింది. పాక్‌తో పాటు దాని ఇద్దరు మిత్రులు చైనా, టర్కీలకు కూడా దెబ్బ తగిలింది. అయితే, మే 9-10 రాత్రిలో భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. 13 పాక్ వైమానిక స్థావరాల్లో 11 స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ సైన్యం నడ్డి విరిచింది. అయితే, ఈ ఆపరేషన్ నిర్వహించడానికి భారత్ మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
BrahMos: భారత్ తన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కి ఎగుమతి చేయనుంది. ఫిలిప్పీన్స్ ఆర్డర్ చేసిన బ్రహ్మోస్ లాంచర్లను, క్షిపణులను రేపటి నుంచి సరఫరా చేయనుంది.
India's Defence Exports: భారతదేశం రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ గా మారాలని భావిస్తోంది. సొంతంగా ఆయుధాలు, రక్షణ రంగ పరికరాలను తయారు చేసుకుంటోంది. గత కొన్నేళ్ల వరకు భారత్ తన రక్షణ రంగ అవసరాల కోసం ఎక్కువగా రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలపై ఆధారపడుతూ వచ్చింది. అయితే గత కొన్నేళ్లుగా భారత్ సొంతంగానే తయారు చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇదే కాకుండా మనదేశంలో తయారైన రక్షణ పరికరాలను ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది.