తెరపై స్కోప్ తక్కువున్నప్పటికి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు కమెడియన్స్. వీరి కామెడీ పటాసుల్లా పేలి సినిమా సక్సెస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా అని సినిమా మొత్తం మేమే ఉంటాం అంటే ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తుంది. కమెడియన్లు హీరోలుగా ఛేంజ్ అవుతుంటే. బ్రహ్మానందం నుండి సంతానం వరకు ఇదే జరిగింది.. జరుగుతోంది. బ్రహ్మీ జోకులను థియేటర్లలో ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడు హీరోగా మారితే జీర్ణించుకోలేకపోతున్నాడు. సునీల్ కూడా జక్కన్న వల్ల లీడింగ్ యాక్టర్ గా మారి…