Botsa Satyanarayana: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా గర్జన జరగనుంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో రేపు జరగబోయే గర్జన అందరి కళ్లు తెరిపిస్తుందని వ్యాఖ్యానించారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించే వాళ్ల కళ్లు తెరిపేలా తమ గర్జన ఉండబోతుందన్నారు. గర్జన తర్వాత ఏ నిమిషంలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం అవ్వాలన్నదే తమ కోరిక అని మంత్రి బొత్స తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే కాదు…
Botsa Satyanarayana: ఏపీలో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు వైసీపీ వికేంద్రీకరణ రాగం అందుకుందని టీడీపీ ఆరోపిస్తుంటే.. వికేంద్రీకరణ చేస్తే టీడీపీకి వచ్చిన నష్టమేంటని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖ గర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 15న ఉదయం 9 గంటల నుంచి విశాఖ…
Botsa Satyanarayana: సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులతో సీపీఎస్ అంశంపై చర్చలు ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. జీపీఎస్‌లో అనేక ప్రయోజనాలు చేర్చామని.. గతంలో చెప్పిన దాని కంటే జీపీఎస్‌ను మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. జీపీఎస్‌కు చట్టబద్దత కల్పిస్తున్నామని.. కనీసం రూ.10 వేల నుంచి గ్యారెంటీ పెన్షన్ వస్తుందని వెల్లడించారు. ఉద్యోగితో పాటు స్పౌస్‌కి కూడా హెల్త్ కార్డు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఎంత మేరకు అవకాశం ఉంటే…
Botsa Satyanarayana: ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేయాలని ఏపీలో ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అధికారంలోకి వచ్చాక పూర్వపరాలు చర్చిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందని బొత్స స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్పారని..…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ అంశం బుధవారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై కొంత స్పష్టతకు ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు సీపీఎస్ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో పాటు మిగిలిన అన్ని జేఏసీలతో జీవోఎమ్ భేటీ కానుంది. జీపీఎస్‌లో మరింత మెరుగైన ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాల నేతలకు వివరించాలనే ఆలోచనలో…
Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులను రెచ్చగొడుతోంది చంద్రబాబేనని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మన ఖర్మ అన్నారు. గత 60 ఏళ్ళుగా గురువులను పూజించుకోవటం ఆనవాయితీగా వస్తోందని.. ప్రతి ఒక్కరూ తమ చిన్నప్పటి గురువులను స్మరించుకుంటూ ఉంటారని.. ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సత్కరించారని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని.. ఆయన…