Nampally Court Bomb Threat: నగరంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను బయటకు పంపిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు పరిసరాలను పూర్తిగా ఖాళీ చేయిస్తున్నారు. నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు.