Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఇద్దరు భారత సైనికులు మరణించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది.
Bengaluru: బెంగళూరులో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఈ అరెస్టులు చేసింది.
Bomb Blast: ఆఫ్రికా దేశం సోమాలియాలో భారీ బాంబు పేలుడు సంభవించింది. శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మొత్తం 27 మంది మరణించినట్లు సీఎన్ఎన్ నివేదించింది. సోమాలియాలోని లోయర్ షాబెల్లె రీజియన్ లో ఘటన జరిగింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. 53 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. మురాలే గ్రామంలోని జనాలే ఏరియాలోని ఫుట్ బాట్ ఫీల్డ్ లో ఈ పేలుడు జరిగింది.
పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు సంభవించింది. శనివారం రాత్రి ఓ భారీ పేలుడు జరగగా.. సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మరో పేలుడు జరిగింది. దీంతో స్వర్ణ దేవాలయానికి సందర్శించడానికి వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలోని దర్బార్ సాహిబ్ దగ్గర శనివారం రాత్రి అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు అమ్మాయిలు స్వల్పంగా గాయపడ్డారు.
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని మానిక్‌చక్ ప్రాంతంలో శనివారం జరిగిన ముడి బాంబు పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు గోపాల్‌పూర్ ప్రాంతానికి చెందిన సోఫికుల్ ఇస్లాం (32), ఫజ్రుల్ సేఖ్ (37)గా గుర్తించారు.
భారతీయ జనతా పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై దుండగులు బాంబులు విసరడంతో తీవ్ర కలకలం రేపింది.. పూర్తి వివారాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలోని ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి దగ్గర ఇవాళ ఉదయం బైక్‌పై వచ్చిన కొందరు దుండగులు బాంబులు విసిరారు.. మొత్తం మూడు బాంబులు ఇంట్లోకి విసిరే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుండగా.. అవి ఇంటి గేటు దగ్గర పేలాయి.. ఈ ఘటనలో ఇంటి గేటు ధ్వంసం అయ్యింది. ఇక, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో.. అంతా…