Pakistan: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో మోటార్‌సైకిల్‌లో అమర్చిన బాంబు పేలడంతో కనీసం ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు జియో న్యూస్ గురువారం నివేదించింది. ప్రాంతీయ రాజధానిలో బుధవారం మోటార్‌సైకిల్ మరమ్మతులు చేస్తుండగా పేలుడు సంభవించింది. పెషావర్ పాకిస్థాన్‌లోని ఆరవ అతిపెద్ద నగరం, ఖైబర్ పఖ్తుంక్వా రాజధాని. “మోటారు సైకిల్‌లో అమర్చిన బాంబు పేలిన తర్వాత పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన తీరుపై సమాచారం సేకరిస్తున్నాం. మోటార్‌సైకిల్‌ను రిపేర్ చేస్తున్నప్పుడు పేలుడు సంభవించినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి” అని పోలీసు అధికారులు తెలిపారు.
Read Also: Megha Parmar: మేఘా పర్మార్‌ను అంబాసిడర్‌గా తొలగించిన ఎంపీ సర్కారు
పెషావర్‌లోని రింగ్‌రోడ్‌లోని ఓ హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడిన ముగ్గురిలో మోటారుసైకిల్ యజమాని ఒకరు, గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడులో 200 గ్రాముల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ని ఉపయోగించినట్లు బాంబు నిర్వీర్య బృందం ఒక ప్రకటనలో తెలిపింది. పేలుడు ఘటనపై విచారణ జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.