ప్రేమకథలకు చిత్రసీమలో తిరుగులేదు అంటూ ఉంటారు. లవ్ స్టోరీస్ లో కాసింత కొత్తదనం కనిపించినా జనానికి ఎక్కేస్తుందనీ సినీజనం చెబుతుంటారు. పరిశీలించి చూస్తే మన చుట్టూనే బోలెడు వరైటీ లవ్ స్టోరీస్ దొరుకుతాయనీ అంటారు. బాలీవుడ్ జనం పరిశీలిస్తున్నారో లేదో కానీ, వాళ్ళ సినీజనాల్లోనే ఓ విచిత్రప్రేమ కథ సాగుతోంది. అందులో నాయకానాయికలు ఎవరంటే హృతిక్ రోషన్, అతని మాజీ భార్య సుజానే ఖాన్ అనే చెప్పాలి. వీరిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. 14 ఏళ్ళు కాపురం…
బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ని యాక్సెస్ చేయలేకపోపోతున్నాను అని ప్రకటించింది. ఈ విషయాన్ని తన అభిమానులు, ఫాలోవర్లకు ఏప్రిల్ 3న తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. తన ఖాతా బహుశా హ్యాక్ అయ్యిందని, ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఏదైనా అసాధారణ కార్యకలాపం జరిగితే జాగ్రత్తగా ఉండాలని కోరింది. “హాయ్, నేను నిన్నటి నుండి నా ఇన్స్టాగ్రామ్ ఖాతాను యాక్సెస్ చేయలేకపోతున్నాను. బహుశా ఇది హ్యాక్ చేయబడి ఉండవచ్చునని మీకు తెలియజేయడానికి…
బాలీవుడ్ నటి మలైకా అరోరా శనివారం (ఏప్రిల్ 2) ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో కారు ప్రమాదానికి గురయ్యారు. అనంతరం మలైకా స్వల్ప గాయాలతో నవీ ముంబైలోని అపోలో ఆసుపత్రిలో చేరింది. నటి సోదరి అమృతా అరోరా స్వయంగా మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. మలైకా అరోరా శనివారం మధ్యాహ్నం పూణెలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఆమె నుదిటిపై స్వల్ప గాయాలయ్యాయి. మలైకా…
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు శృంగభంగమైంది! అతని తాజా చిత్రం ‘అటాక్’ బాక్సాఫీస్ బరిలో అటాక్ చేయలేకపోయింది. పేట్రియాటిజం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ మూవీలో జాన్ అబ్రహంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, ప్రకాశ్ రాజ్, రజిత్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లక్ష్య రాజ్ ఆనంద్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సినిమా మేకింగ్ పరంగా ‘అటాక్’కు మంచి గుర్తింపే వచ్చినా ఓపెనింగ్ రోజు పెద్దంత…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తాజాగా తన అభిమానులను అద్భుతమైన ఫోటోషూట్లతో ట్రీట్ చేస్తోంది. తాజా పిక్స్ ఆమె అభిమానులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. గ్రాజియాఇండియా మిలీనియల్ అవార్డుల వేడుకలో జాన్వీకపూర్ మెరిసిపోయే సిల్వర్ కలర్ డ్రెస్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అందాలను దాచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని జాన్వీ ఈ పిక్స్ లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్లను తలదన్నే అందంతో మెరిసిపోతోంది. రోజురోజుకూ జాన్వీ…
Swara Bhasker కు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు. అయితే ఆమెకు అక్కడి క్యాబ్ డ్రైవర్ అనుకోని షాక్ ఇచ్చాడు. షాపింగ్ చేసిన తర్వాత స్వర ఒక క్యాబ్‌ను అద్దెకు తీసుకుంది. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ మాత్రం అనుకోని విధంగా ఆమె వస్తువులను దొంగిలించడంతో ఖంగుతినడం హీరోయిన్ వంతయ్యింది. ఆ అనుకోని పరిణామానికి…
ప్రస్తుతం బాలీవుడ్ చూపు అంతా టాలీవుడ్ మీదనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క స్టైలిష్ మేకోవర్ తో టాలీవుడ్ హీరోలు.. బాలీవుడ్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్ లాంటి వారు ముంబై లో స్టైలిష్ మేకోవర్ లో కనిపిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా లైగర్ బ్యాచ్ బాలీవుడ్ గ్రాండ్ పార్టీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు.…
టాప్ స్టార్స్ తమ సినిమాల కోసం కొత్త కొత్త మేకోవర్స్ ట్రై చేయడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కొంతమంది స్లిమ్‌గా కనిపించే నటీనటులు సినిమాల కోసం లావెక్కుతుంటే, మరికొంత మంది నటులు సినిమాల కోసం లేదా వ్యక్తిగత ఆరోగ్యం కోసం స్లిమ్‌గా మారతారు. స్టార్స్ అంటే సినిమాల కోసం ఏమైనా చేస్తారు. అయితే ఆ స్టార్స్ ఫ్యామిలీలో ఉన్న మరికొంతమంది కూడా ఇటీవల కాలంలో సినీ తరాలకు పోటీనిచ్చేలా మారిపోతున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో…
ప్రముఖ నటుడు రిషీ కపూర్ 2020 ఏప్రిల్ 30న లుకేమియాతో కన్నుమూశారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘ది బాడీ’ దానికి ముందు సంవత్సరం విడుదలైంది. అయితే అప్పటికే సెట్స్ పై ఉన్న ‘శర్మాజీ నమ్కీన్’ షూటింగ్ మాత్రం పూర్తి కాలేదు. హితేశ్ భాటియా దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాలో జుహీచావ్లా, సుహైల్ నయ్యర్, తరుక్ రైనా, సతీష్ కౌశిక్, షీబా చద్దా, ఇషా తల్వార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిషీ కపూర్ మరణానంతరం ఆయన…
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. మరోవైపు యుద్ధంలో దెబ్బతిన్న సుమీ నగరంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులందరూ విడుదలయ్యారు. ఇంతకుముందు సుమీలో చిక్కుకున్న చాలా మంది భారతీయ విద్యార్థులు తమ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో భారతీయ విద్యార్థుల పట్ల జాతి వివక్ష చూపిస్తున్నారని, స్థానిక దుకాణాలలో జాత్యహంకారాన్ని కూడా ఎదుర్కొన్నామని ఓ విద్యార్థి తెలిపాడు. ఈ విషయంపై బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని…