హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడి ఆసుపత్రిలో చేరిన వార్తలు ఇటీవల బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నవంబర్ 22న ‘ఈఠా’ సినిమా షూటింగ్ సెట్ లో లవణీ సాంగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆమె ఎడమ కాలి వేళ్ళకు ఫ్రాక్చర్ కావడంతో గాయం తీవ్ర స్థాయికి చేరింది. భారీ ఆభరణాలు, సంప్రదాయ నౌవరీ చీరలో డ్యాన్స్ రిహార్సల్ చేస్తుండటంతో కండరాలపై అదనపు ఒత్తిడి పడి ఇబ్బంది కలిగిందని శ్రద్ధా తెలిపింది. తన పాత్ర కోసం ఏకంగా 15 కిలోల…