హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడి ఆసుపత్రిలో చేరిన వార్తలు ఇటీవల బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నవంబర్ 22న ‘ఈఠా’ సినిమా షూటింగ్ సెట్ లో లవణీ సాంగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆమె ఎడమ కాలి వేళ్ళకు ఫ్రాక్చర్ కావడంతో గాయం తీవ్ర స్థాయికి చేరింది. భారీ ఆభరణాలు, సంప్రదాయ నౌవరీ చీరలో డ్యాన్స్ రిహార్సల్ చేస్తుండటంతో కండరాలపై అదనపు ఒత్తిడి పడి ఇబ్బంది కలిగిందని శ్రద్ధా తెలిపింది. తన పాత్ర కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరగాల్సి రావడంతో, డ్యాన్స్ సమయంలో ఫిజికల్ స్ట్రెయిన్ మరింత పెరిగిందని చెప్పింది. గాయపడ్డా కూడా క్లోజ్‌అప్ షాట్స్ అయినా పూర్తిచేద్దామని ఆమె కోరినా, గాయం ముదిరే ప్రమాదం ఉండటంతో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ షూటింగ్‌ను వెంటనే నిలిపివేశారు. ఈ కారణంగా ‘ఈఠా’ మూవీ షెడ్యూల్ కొంతకాలం వరకు వాయిదా పడింది.
Also Read : Naveen Polishetty : సంక్రాంతి రేసు నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్ అవుట్ ..?
తాజాగా శ్రద్ధా కపూర్ తన ఆరోగ్యంపై హెల్త్ అప్‌డేట్ ఇస్తూ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నా కండరాలు చితికిపోయాయి. ఇది మసిల్ టియర్. కానీ నేను టెర్మినేటర్‌లాగా తిరుగుతున్నాను. నాకు కొంచెం విశ్రాంతి అవసరం. త్వరలోనే పూర్తిగా కోలుకుంటాను” అంటూ ఫ్యాన్స్‌కు ధైర్యం చెప్పింది. ‘ఆస్క్ మీ క్వశ్చన్’ సెషన్‌లో అభిమానులు ఆమె కాలు గురించి అడగగా, ప్లాస్టర్ పెట్టుకున్న వీడియోను కూడా పంచుకుంది. ఆమె గాయంపై అభిమానులు ఆందోళన చెందుతున్న అప్పటికీ, ఆమె త్వరలోనే రీక్వర్ అయి సెట్లోకి తిరిగి వస్తుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.