బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి కేసులో ముంబై పోలీసులు భారీ విజయం సాధించారు . నిందితుడు షరీఫుల్ వేలిముద్రలు ముంబై పోలీసుల అనేక నమూనాలతో సరిపోలాయి. ముంబై పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రల పరీక్ష కోసం పంపిన కొన్ని నమూనాలు నివేదికలు వచ్చాయి. నివేదికలో కొన్ని వేలిముద్రలు సరిపోలాయి. అయితే, పోలీసులు తుది నివేదిక కోసం వేచి చూస్తున్నారు. గత నెలలో సైఫ్…
ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఒక అనుమానితుడిని ముంబై పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. నటుడిపై దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా.. దుండగుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి యావత్ దేశాన్ని షాక్‌కి గురి చేసింది. అయితే, సకాలంలో ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించిన ఆటో డ్రైవర్ ఇప్పుడు హీరోగా మారారు. ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా హుటాహుటీన సైఫ్‌ని ఆస్పత్రికి తరలించడంలో సాయం చేశాడు. ఈ సంఘటన గురించి ఆయన వెల్లడించారు.
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన దేశంలో చర్చనీయాశంగా మారింది. ఇంట్లోకి దూరిన దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే అతడిని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత దుండగుడు ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా పారిపోవడం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.