మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గం గులాబీ గూటిలో ఉన్న నేతల మధ్య విభేదాలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో నేడు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్‌లో రసాబాసగా మారింది. సమావేశాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బాయ్ కట్ చేశారు. అధికార పార్టీ మేయర్ సామల బుచ్చిరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ టీఆర్ఎస్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిరవి గౌడ్ ఆధ్వర్యంలో కౌన్సిల్ బయట నిరసన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్…