HYDRA DRF Rescue: అర్ధరాత్రి హైడ్రా ఆపదమిత్ర పాత్ర పోషించింది. మిరాలం చెరువులో చిక్కుకున్న 9 మందిని హైడ్రా DRF బృందం ఆదివారం అర్ధరాత్రి కాపాడింది. పాతబస్తీ జూ పార్కు దగ్గరలోని మిరాలం ట్యాంక్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వీరంతా మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉన్నవారు. మీరాలం ట్యాంక్ మీదుగా నిర్మించనున్న వంతెన కోసం సాయిల్ టెస్ట్ కు వెళ్లిన కార్మికులు , ఇంజనీర్లు. రోజులాగే ఆదివారం ఉదయం మిరాలం…