హరిహర వీరమల్లు సినిమా విడుదలై మిక్స్‌డ్ టాక్ సంపాదించింది. పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని క్రిష్ డైరెక్షన్‌లో మొదలుపెట్టారు. అయితే సినిమా వాయిదాలు పడుతూ వస్తున్న నేపథ్యంలో క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తలకెత్తుకొని సినిమా పూర్తి చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…
హరి హర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ అందుకున్నారు. సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా, ఓపెనింగ్ విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ రోజు అమరావతిలో క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. నా జీవితంలో ఇది మొదటి సక్సెస్ మీట్ అని పేర్కొన్న ఆయన, పోడియం లేకపోతే మాట్లాడలేకపోతున్నాను…
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మొదటి షో మరో రెండు గంటల్లో పడబోతోంది. అయితే హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రాత్రి 9 గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత స్పెషల్ షో ప్లాన్ చేశారు. ఈ స్పెషల్ షోలకు 700కు పైగా టికెట్ రేట్లు అమ్ముతున్నారు. అయినా సరే ఏమాత్రం తగ్గకుండా సోల్డ్ అవుట్. పెట్టినవి పెట్టినట్లు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసేసుకుంటున్నారు ఆడియన్స్. నిజానికి ముందుగా సింగిల్ స్క్రీన్ మాత్రమే…