Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ప్రమాదం తప్పింది. అన్నపూర్ణ భవన్‌లో అల్పాహారం తయారీకి ఉపయోగించే బాయిలర్ పేలింది. పేలుడు ధాటికి బాయిలర్‌లోని ఎస్ఎస్ ట్యాంక్ ఎగిరిపడింది. ఘటనాస్థలిలో సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నిత్యాన్నదానం నిర్వహించే చోట ఈ ప్రమాదం జరిగింది. స్టీమింగ్ బాయిలర్ బాగా వేడేక్కడంతో పేలిపోయినట్టుగా అక్కడ పనిచేసే సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఈ బాయిలర్ పేలుడు కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా దేవస్థానం…
అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడుతో స్థానికులంతా ఉలిక్కిపాడ్డారు.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ పేలుడు కలకలం సృష్టించింది.. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ అద్దాలు, తలుపులు, కిటికీలు ధ్వంసం అయ్యాయాయి.. అంతే కాదు.. వివిధ కేసుల్లో పట్టుబడిన కార్లు, బైక్‌లు.. సీజ్ చేసిన వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.. నాటు బాంబు పేలిందా లేక క్వారీలకు వాడే జిల్లెట్స్టిక్స్ ? పేలిందా అనే అనుమానాలు వ్యక్తం కాగా.. చివరకు 2018లో…
2007 ఆగస్టు 25.. హైదరాబాద్ మహానగరంతో పాటు దేశం మొత్తాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్లకు ఇవాల్టితో 15 ఏళ్లు పూర్తయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. బాంబుల్లో వినియోగించిన ఇనుప ముక్కల ధాటికి వందలాది మంది శరీర అవయవాలు కోల్పోయి జీవచ్ఛవాలుగా మారారు. ఈ దారుణానికి ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ పాల్పడింది. ప్రశాంత వాతావరణంలో అలజడి సృష్టించింది.…
యూపీలోని హాపూర్ జిల్లా ధౌలానాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12మంది మృతిచెందారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఢిల్లీకి 60కిలోమీటర్ల దూరంలోని ధౌలానాలోని పారిశ్రామిక కేంద్రంలో ఉంది. ఈ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా బాయిలర్ పేలింది. పేలుడు తాకిడికి చుట్టుపక్కల ఉన్న కొన్ని…
మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది.. భవనంలోపల గ్రెనేడ్ పడినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇవాళ రాత్రి పేలుడు సంభవించింది. రాకెట్‌తో నడిచే గ్రెనేడ్ భవనంలోని మూడో అంతస్తులో పడిందని చెబుతున్నారు.. పేలుడు ధాటికి కిటికీలు, డోర్లు ధ్వంసమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాకెట్ లాంచర్ ఉపయోగించి దాడికి పాల్పడినట్టుగా అంచనా వేస్తున్నారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. కార్యాలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు.. సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఘటనా స్థలాన్ని…
గ్యాస్ లీకై ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో భారీ పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతిచెందినట్టుగా తెలుస్తోంది… క్యూబా రాజధాని హవానాలో ఈ ఘటన జరిగింది… సరటోగా పిలిచే అతి పురాతణమైన ఫైవ్స్టార్హోటల్లో ఈ ప్రమాదం జరిగింది.. మరో 50 మందికిపైగా గాయపడినట్టుగా తెలుస్తుండగా.. దాదాపు 13 మంది ఆచూకీ దొరకడం లేదని చెబుతున్నారు.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది రెస్క్యూటీమ్.. ఈ…
వరుస బాంబు పేలుళ్లతో మరోసారి ఆఫ్ఘనిస్థాన్ ఉలిక్కిపడింది… ఏకంగా ఐదు బాంబులు పేలడంలో అంతా ఆందోళనకు గురయ్యారు.. కాబూల్ సహా ఐదు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి.. ఈ పేలుళ్లలో మొత్తం 20 మందికి పైగా మృతిచెందారు.. ఇక, ప్రార్థనా మందిరంలో జరిగిన భారీ పేలుడులో 65 మంది గాయాలపాలయ్యారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆఫ్ఘన్‌లోని మజార్-ఎ-షరీఫ్‌లోని మసీదులో జరిగిన పేలుడులో 5 మంది మృతి చెందగా, 50 మందికి గాయాలు అయ్యాయి..…
హైదరాబాద్ శివారులో పేలుడు కలకలం సృష్టించింది.. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగర్‌లో చెత్త కుండీలో పేలుడు సంభవించింది… ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆనంద్ నగర్‌లో చెత్త సేకరించేందుకు రంగముని సుశీలమ్మ, ఆమె భర్త ఆనందనగర్ పారిశ్రామిక వాడలకు ఉదయం ఆటోలో వెళ్లారు.. అయితే, చెత్త సేకరిస్తున్నండగా పేలుడు జరిగింది.. ఈ ఘటనలో సుశీలమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..…