మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది.. భవనంలోపల గ్రెనేడ్ పడినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇవాళ రాత్రి పేలుడు సంభవించింది. రాకెట్‌తో నడిచే గ్రెనేడ్ భవనంలోని మూడో అంతస్తులో పడిందని చెబుతున్నారు.. పేలుడు ధాటికి కిటికీలు, డోర్లు ధ్వంసమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాకెట్ లాంచర్ ఉపయోగించి దాడికి పాల్పడినట్టుగా అంచనా వేస్తున్నారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. కార్యాలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు.. సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Read Also: Central vs Telangana: కేంద్రం వర్సెస్ తెలంగాణ.. ఆర్థికశాఖ కాన్ఫరెన్స్‌లో అభ్యంతరం
మరోవైపు.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పోలీసుల నుంచి పూర్తి నివేదిక కోరారు. కాగా, పంజాబ్ పోలీసులు రాష్ట్రంలోని తరణ్ జిల్లాలోని ఒక గ్రామంలో ఉగ్రవాద దాడులను అడ్డుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన తర్వాత ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.