పశ్చిమ ఆఫ్రికా దేశంలోని బుర్కినా ఫాసోలో విషాద ఘటన చోటు చేసుకుంది. బామ్ బ్లోరా గ్రామంలోని బంగారు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 59 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారాన్ని శుద్ధిచేసే రసాయనాల వల్లే పేలుడు సంభవించిందని సమాచారం. పేలుడు సంభవించిన వెంటనే మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయని… తొలి పేలుడు రాత్రి 2…
హైదరాబాద్ కూకట్‌పల్లి వెంకట్రావునగర్‌లోని ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇంటి కిటికీలు, తలుపులు, ఇతర విలువైన సామాగ్రి ధ్వంసమయ్యాయి. ఫ్రిజ్ నుంచి కంప్రెసర్ గ్యాస్ లీక్ కావడంతోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు…
పంజాబ్‌లోని లుథియానా కోర్టులో భారీ పేలుడు జరిగింది.. కోర్టు కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో పేలుడు సంభవించగా… ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు.. ఇక, పేలుడు ధాటికి భవనం ధ్వంసమైంది… ఈ పేలుడు ఘటనలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. భవనంలోని రెండో అంతస్తులోని బాత్‌రూమ్‌లో మధ్యాహ్నం 12:22 గంటల ప్రాంతంలో పేలుడు జరిగినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు బాత్రూమ్ గోడలు దెబ్బతిన్నాయి మరియు సమీపంలోని గదుల అద్దాలు పగిలిపోయాయి.. జిల్లా…
యాదాద్రి జిల్లాలోని వంగపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలుడు ధాటికి కెమికల్స్ ఎగసిపడ్డాయి. దీంతో ఫ్యాక్టరీ మొత్తం దట్టంగా పొగ కమ్ముకుంది. సైరన్ మోగడంతో కార్మికులు భయంతో పరుగులు తీయగా.. ఏం జరిగిందో తెలియక ప్రజలు భయంతో వణికిపోయారు. కెమికల్స్ రోడ్డుపైన పడటంతో పాటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పేలుడు గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక…
హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన విష్ణు (25), జగన్నాథ్ (30)గా పోలీసులు గుర్తించారు. అనంతరం క్లూస్ టీమ్ బృందం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. Read Also: దీపావళి వేడుకల్లో అపశృతి.. పలువురికి గాయాలు అయితే…
ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశం అయిన తర్వాత కూడా పేలుళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. మొన్నటి మొన్న మసీదులో ఆత్మాహుతి దాడిలో భారీ ప్రాణనష్టం జరగగా.. ఇవాళ కాందహార్‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుళ్లు జరిగాయి.. ఈ ఘటనలో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు చెబుతున్నారు.. కాందహార్‌లో నడిబొడ్డున్న ఉన్న మసీదులో ఈ పేలుడు సంభవించింది.. షియా వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ పేలుడు జరిగింది.. 16…
భారత భూభాగంలోకి డ్రోన్లు చొచ్చుకు రావడం… దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోకి డ్రోన్లను పంపి… ఐఈడీలను జారవిడిచారు. అర్ధరాత్రి తర్వాత రెండు డ్రోన్లు రావడంతో… జవాన్లు వీటిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన సిబ్బందికి గాయాలయ్యాయి.. వాయుసేన స్థావరంపై దాడి జరిగిన 24 గంటల్లోనే మరో సైనిక స్థావరం వద్ద డ్రోన్ల సంచరించడం ఆందోళనకు గురి చేస్తోంది. డ్రోన్ల దాడి తర్వాత… జమ్ములో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు, జవాన్లు… ప్రతి…
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్రంలోని పూణెలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దూరదృష్టవశాత్తు 15 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో ఆ కెమికల్ ఫ్యాక్టరీలో 37 మంది కార్మికులు ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ ఘటన సమాచారం తెలియగానే.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటల నుంచి 20 మందిని కాపాడింది. మరో ఇద్దరు కార్మికులు మంటల్లోనే చిక్కుకోవడం బాధకరమైన విషయం. ప్రస్తుతం మంటలు ఆర్పే…
కరీంనగర్ పేలుడు కేసుతో పాతబస్తీకి లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాతబస్తీలో అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రం ఉన్నట్లు తేలడంతో… హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అలాగే కరీంనగర్ పోలీసులు కలిసి ఆకస్మిక తనిఖీలు చేసారు. నాలుగు రోజుల క్రితం కరీంనగర్ లో కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో పాతబస్తీ అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రం గురించి వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో 1000 కేజీల డిటోనేటర్ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు…