Suven Pharma: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సువెన్ ఫార్మాస్యుటికల్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలు పట్ల రెండు ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌స్టోన్ మరియు అడ్వెంట్ ఇంటర్నేషనల్ అనే కంపెనీలు సువెన్ ఫార్మాలో షేర్ కోసం విడివిడిగా సంప్రదింపులు జరుపుతున్నాయని స్టాక్ మార్కెట్ వర్గాల సమాచారం. సువెన్ ఫార్మాలో షేరును విక్రయించే విషయం ప్రమోటర్ల పరిశీలనలో ఉందనే వార్తలు ఇంతకు ముందు కూడా వచ్చాయి.