కరోనా కాలంలో రోజుకోక కొత్త ఇన్పేక్షన్, రోజుకో కొత్త ఫంగస్‌లు భయపెడుతున్నాయి. ఈ ఫంగస్ లు ఎంతవరకు అపాయమోగాని, వాటిపై వస్తున్న వార్తలతోనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ లు దడపుట్టిస్తుండగా ఇప్పుడు మరో కొత్త వైరస్ ఇబ్బంది పెడుతుంది. అదే క్రీమ్ ఫంగస్. క్రీమ్ ఫంగస్ కేసు ఒకటి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ వైద్య కళాశాలలో ఈఎన్‌టీ వైధ్యాధికారులు గుర్తించారు. బ్లాక్ ఫంగస్‌తో పాటుగా రోగి శరీరంలో…
ఉల్లి లేని ఇల్లులేదు. అన్నిరకాల కూరల్లో ఉల్లి తప్పనిసరి. కొన్నిసార్లు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటుంది. ఇలాంటి ఉల్లి ఇప్పుడు మరో లొల్లికి కారణమైంది. ఉల్లిపైన ఉండే పోరలు నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. ఆ మచ్చలే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారీతీసింది. ఉల్లి పొరలపై ఉండే నల్లని ఫంగస్ వలన బ్లాక్ ఫంగస్ సోకుతుందని ప్రచారం జరిగింది. దీంతో ఉల్లిని కొనుగోలు చేయడానికి ప్రజలు భయపడ్డారు. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారం అని, ఎయిమ్స్…
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడంలేదు. రోజువారీ పాజిటీవ్ కేసులతో పాటు మరణాల సంఖ్య సైతం ఆంధోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులతో పాటు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా భయపెడుతున్నాయి. దేశంలో ఇప్పటికే ఈ కేసులు 12 వేలకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు నానాటికి పెరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే ఈ కేసులు 50 కి చేరాయి. బాదితులు కాకినాడలోని జీజీహెచ్ లో…
ఒకవైపు కరోనా మహమ్మారి దేశాన్ని భయపెడుతుంటే, మరోవైపు బ్లాక్ ఫంగస్ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకూ దేశంలో బ్లాక్‌ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఇక ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. విజయవాడ నగరాన్ని బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. నగరంలో ఈ కేసులతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్నది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే 50కి పైగా ఈ కేసులు నమోదయ్యాయి. అటు ప్రైవేట్…
బ్లాక్ ఫంగస్ మందుల పై సీఎం జగన్ మాట్లాడుతూ.. బ్లాక్ ఫంగస్ కు వాడే ఇంజక్షన్లు చాలా కొరతగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వీటి కొరత ఉంది అని అన్నారు. ఒక్కో రోగికి వారానికి కనీసంగా 50 ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి మనకు 3వేల ఇంజక్షన్లు మాత్రమే వచ్చాయి. మరో 2వేల ఇంజక్షన్లు వస్తాయని చెప్తున్నారు. ఇవన్నీకూడా సరిపోని పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నాం. వీలైనంత మేర ఇంజక్షన్లు తెప్పించడానికి గట్టిగా…
చిత్తూరు జిల్లాలో కరోనా కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. జిల్లాలో ఒక్కరోజులో రికార్డ్ స్టాయిలో 15 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో 9 కేసులు, స్విమ్స్ ఆసుపత్రిలో 6 కేసులు నిర్ధారణ జరిగింది. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 33 కి చేరింది. తిరుపతి రుయాలో 21, స్విమ్స్ లో 12 కేసలకు చికిత్స జరుగుతున్నది. ఇక ఇదిలా ఉంటే,…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, ఇప్పుడు మరో కొత్త సమస్య రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతుండటం ఆంధోళన కలిగిస్తుంది. బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. ఆర్మూర్ డివిజన్‌లో 8 మందికి ఈ వ్యాది నిర్ధారణ జరిగింది. నవీపేటలో 24 గంటల వ్వవధిలో…
విశాఖలో బ్లాక్ ఫంగస్ వణుకుపుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సిఎం జగన్, సెక్రటరి. ఏకే సింఘాల్, ప్రభుత్వాధికారులకు లేఖ రాశారు తూర్పు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు. విశాఖ జిల్లా బ్లాక్ పంగస్ కేసులపై చర్యలు తీసుకోవాలని…బ్లాక్ పంగస్ కు కెజీహెచ్ లో బెడ్ కేటాయించడమే కాదు… మందులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. మందులు లేవని భాధితులు చెప్తున్నారని…ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు ఆసుపత్రులలో…
మాస్క్ ధరించడం వలన కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మాస్క్ లేకుండా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరించడం వలన వైరస్ లోనికి ప్రవేశించలేదని చెప్తున్నారు. అయితే, ఇప్పుడు అదే మాస్క్ వలన బ్లాక్, వైట్ ఫంగస్ వంటివి సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ ను ఎక్కువ రోజులు వాడటం వలన, శుభ్రం చేసుకోకుండా మాస్క్ ను వినియోగించడం వలన అందులో మ్యూకోర్ మైకోసిస్ అనే ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని, ఈ…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని, మనుషుల జీవితాలను ఎలా మార్చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా మహమ్మారి బారిన పడి ఎలాగోలా కోలుకున్నా, బ్లాక్ ఫంగస్ వంటి రోగాలు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కరోనా బారిన పడిన వ్యక్తుల్లో చాలా మంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. బ్లాక్ ఫంగస్ కు అందించాల్సిన వైద్యం ఖరీదు కావడం, ఇంజెక్షన్లు తగినన్ని అందుబాటులో లేకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక బ్లాక్ ఫంగస్ తో పాటుగా వైట్ ఫంగస్ కూడా విజృంభిస్తోంది. అయితే,…