ఉల్లి లేని ఇల్లులేదు. అన్నిరకాల కూరల్లో ఉల్లి తప్పనిసరి. కొన్నిసార్లు ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటుంది. ఇలాంటి ఉల్లి ఇప్పుడు మరో లొల్లికి కారణమైంది. ఉల్లిపైన ఉండే పోరలు నల్లటి మచ్చలు కనిపిస్తుంటాయి. ఆ మచ్చలే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారీతీసింది. ఉల్లి పొరలపై ఉండే నల్లని ఫంగస్ వలన బ్లాక్ ఫంగస్ సోకుతుందని ప్రచారం జరిగింది. దీంతో ఉల్లిని కొనుగోలు చేయడానికి ప్రజలు భయపడ్డారు. అయితే, ఇదంతా తప్పుడు ప్రచారం అని, ఎయిమ్స్ పేర్కొన్నది. కూరగాయలు, వస్తువుల ద్వారా బ్లాక్ ఫంగస్ రాదని, ఉల్లి గడ్డలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్ వలన వస్తుందని, అది బ్లాక్ ఫంగస్ కాదని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. సోషల్ మీడియాలో కావాలని ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని డాక్టర్ గులేరియా పేర్కొన్నారు.