టయోటా కిర్లోస్కర్ మోటార్ భారతదేశంలో తన ప్రసిద్ధ పికప్ హిలక్స్ యొక్క కొత్త బ్లాక్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. భారతదేశంలోని అన్ని టయోటా డీలర్‌షిప్‌లలో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. దీని డెలివరీ మార్చి, 2025లో ప్రారంభమవుతుంది. భారత మార్కెట్లో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 37.90 లక్షలుగా ఉంచారు. నల్ల పులిలాగా కనిపించే ఈ కారు లుక్ అదిరిపోయింది. ఈ హిలక్స్ డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..