అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు పైలెట్ సుమిత్ లాస్ట్ మెసేజ్ ఇచ్చారు. ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో సందేశం బయటికొచ్చింది.
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘోర విమాన దుర్ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలిలో సహాయచర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా స్పందించినట్లు స్పష్టం చేశారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఈ విమానం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. తాజాగా.. విమానం కూలిపోయిన ప్రదేశం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ఓ పోలీసు అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ వెల్లడించింది.
రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే, ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైనిక రవాణా విమానం కుప్పకూలిన ప్రాంతంలో దర్యాప్తు బృందానికి బ్లాక్‌బాక్స్ దొరికింది.