అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు పైలెట్ సుమిత్ లాస్ట్ మెసేజ్ ఇచ్చారు. ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో సందేశం బయటికొచ్చింది. పైలెట్ సుమిత్ ఐదు సెకన్ల మెసేజ్ ఇచ్చారు. మేడే, మేడే, మేడే అంటూ మెసేజ్ అందించారు సుమీత్. ‘మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్’ అంటూ తెలిపారు. మేడే కాల్ ఇచ్చిన వెంటనే విమానం కూలిపోయిందని ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. సుమిత్ సబర్వాల్ కాల్ చేసినట్లు ఏటీసీలో రికార్డ్ అయిందని స్పష్టం చేశారు.
READ MORE: Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు.. టెల్ అవీవ్‌ను లక్ష్యంగా ఐడిఎఫ్ రాకెట్ లాంచర్..
కాగా.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన మృతుల సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. మెడికోలు, స్థానిక ప్రజలు కలిసి మొత్తం ఆ సంఖ్య 274కు చేరినట్లు పేర్కొంది. విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహం ఉంది. తొలుత 24 మంది మృతి చెందగా.. తాజాగా చికిత్స పొందుతూ మరో 9 మంది చనిపోయారు. ఇప్పుడా సంఖ్య 33కు పెరిగింది. మొత్తంగా మృతుల సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ప్రమాదం స్థలంలోనే అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్ పైకప్పుపై దొరికింది. అధికారులు విశ్లేషించనున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోనున్నారు.