పీయుష్ గోయల్ వ్యాఖ్యలు రైతులను గందరగోళంలోకి నెట్టాయని… యాసంగి వడ్లు కొంటామని లిఖితపూర్వకంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమైనా మాట్లాడారా? అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చేందుకు క్లియరెన్స్ అయిందని పేర్కొన్నారు. నలుగురు బిజెపి ఎంపిలు ఏం చేస్తున్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కు అయినా జాతీయ హోదా ఇప్పించారా? అని నిలదీశారు. కేసీఆర్…
గత అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ నాయకులు హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చుతామంటూ ప్రకటనలు చేశారు. యూపీ సీఎం యోగి కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ఈ విషయాన్ని ఉద్ఘాటించారు. దీంతో ఈ విషయంపై నిరసన జ్వాలలు కూడా రగిలాయి. అయితే తాజాగా భాగ్యనగర్ పేరుతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ట్వీట్ చేయడంతో మరోసారి ట్విట్టర్ వేదికగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్…
వరి ధాన్యం కొనుగోలు అంశం కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య అగ్గి రాజేస్తుంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు చేశారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. రెండు రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఈ ధాన్యం కొనుగోలు అంశాన్ని లేవనేత్తారని… అంతకు ముందు ఈ విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. సీఎం తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని విమర్శించారు.…
ఇటీవలే కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఉదయం నుంచి ప్రారంభమైంది. ఉదయం నుంచి ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తున్నాయి. 144 వార్డులున్న కోల్‌కతా కార్పొరేషన్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 7 చోట్ల విజయం సాధించి 114 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కేవలం 4 చోట్ల మాత్రమే లీడింగ్‌లో ఉన్నది. కాంగ్రెస్, వామపక్షాలు తలా రెండు చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నారు. Read: వైరల్: నెటిజన్ల…
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది యూపీలో నేతలు అప్పుడే ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వాలు మొదలెట్టేశారు. ప్రతిపక్షాలు, అధికార పక్షం ఇప్పటికే ఎన్నికల ర్యాలీలు, సభలతో ఓటర్లను ఆకర్షించేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్‌కు కీలకం కావడంతో ఎవ్వరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరోవైపు బీఎస్పీ, ఎస్పీ పార్టీలు కూడా ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రలోభాలకు తెరలేపింది. యూపీ సీఎం యోగి…
యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి మంత్రి ఈశ్వర్ హాజరయ్యారు. కరీంనగర్- రాయపట్నం రహదారిపై మంత్రి బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మెయిన్ రోడ్డు నుంచి మల్లాపూర్ దాకా జరిగిన రైతుల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో యాసంగి దొడ్డు ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వకుండా…
దేశంలోని కీలక కంపెనీల సీఈఓలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. వచ్చే ఏడాది బడ్జెట్ దృష్ట్యా సీఈఓల సలహాలు, సూచనలను మోడీ తీసుకున్నారు. దేశ ఆర్థిక వృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కార్పొరేట్ సెక్టార్‌కు కేంద్రం అందిస్తున్న ప్రోత్సహాకాలను సీఈఓలకు వివరించారు. దేశీయంగా పారిశ్రామిక ఉత్పత్తిని పెంచాలని సూచించారు. రక్షణ రంగంలో కొత్త సాంకేతికత ఆవశ్యకతపై చర్చించారు.ప్రధానంగా దేశంలో నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టేలా ఆయా కంపెనీల సీఈఓలకు ప్రధాని మోడీ సూచించారు. దేశం ఆర్థిక రంగంలో…
సీనియర్ సిటిజన్లు బూస్టర్ డోస్ తీసుకునేందుకు అనుమతించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఒమైక్రాన్ వేరియంట్ కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. బూస్టర్ డోసులిచ్చే ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 107 కేసులు నమోదవడంతో .. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, ఆదివారం ఒక్కరోజే 100 కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. అయితే ఇవి…
సోమవారం రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడడంపై ఆయన స్పందిస్తూ ‘దమ్ముంటే చర్చ పెట్టండి’ అంటూ కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సవాల్ విసిరారు. మోడీ ప్రభుత్వానికి అసలు పార్లమెంట్‌ను నడిపించడమే రాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులపై సస్పెండ్ వేటు ఎత్తి వేయడంతో పాటు పలు సమస్యలపై చర్చలు జరిపించాలని ప్రతిపక్షాలు నినాదాలు చేస్తున్నాయి. దీంతో సోమవారం కూడా సభను రెండు సార్లు సభను వాయిదా వేశారు. సభలను మాటిమాటికీ వాయిదా వేస్తుండటంపై…