చండీగఢ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ అనూహ్య విజయం.. బీజేపీ వెనక్కి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీకే పరిమితం కావడం కాదు.. క్రమంగా ఇతర ప్రాంతాలకు ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. ఇదే సమయంలో ఆ పార్టీని అనూహ్య విజయం పలకరించింది.. చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించింది ఆమ్‌ఆద్మీ పార్టీ.. చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి బరిలోకి దిగిన ఆప్.. 14 స్థానాల్లో విజయం సాధించింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 35 స్థానాలు ఉండగా.. అందులో 14 కైవసం చేసుకుంది ఆప్.. ఇక, గత ఎన్నికల్లో 20 స్థానాల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి వెనుకబడి 12 స్థానాలకే పరిమితం అయ్యింది.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 8 సీట్లలో విజయం సాధించగా.. శిరోమణి అకాలీదళ్ ఒక సీటు తన ఖాతాలో వేసుకుంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చిన ఫలితాలతో ఆమ్‌ఆద్మీ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.. సంబరాల్లో మునిగిపోయాయి ఆప్ శ్రేణులు.. ఇక, ఈ ఫలితాలపై ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈ విజయం ‘మార్పునకు సంకేతం’గా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం పంజాబ్‌లో చోటుచేసుకోనున్న మార్పులకు సంకేతం. అవినీతి రాజకీయ నాయకులను చండీగఢ్ ప్రజలు తోసిపుచ్చి, ఆప్ నిజాయితీ రాజకీయాలకు పట్టంకట్టారు అని పేర్కొన్నారు..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!