Sankranti 2026: బ్లాక్‌బస్టర్ ర్యాంపేజ్.. ‘నారి నారి నడుమ మురారి’కి హ్యూజ్ రెస్పాన్స్!
- సంక్రాంతి పండుగకు ఐదు సినిమాలు రిలీజ్
- కలెక్షన్స్‌లో సత్తాచాటిన పలు సినిమాలు
- ఎంటర్‌టైన్‌లో దూసుకెళుతున్న నారి నారి నడుమ మురారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను అలరించడానికి చాలా సినిమాలే వచ్చాయి. ‘ది రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. రోజుల వ్యవధిలో విడుదలైన ఈ ఐదు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే కొన్ని సినిమాలు కలెక్షన్స్‌లో సత్తాచాటుతుండగా.. మరికొన్ని అభిమానులను ఎంటర్‌టైన్ చేయడంలో దూసుకెళుతున్నాయి. ఈ జాబితాలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి మొదటి స్థానంలో ఉంది.
2026 సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను అలరించిన చిత్రంగా ‘నారి నారి నడుమ మురారి’ నిలుస్తోంది. ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ చూసినా చప్పట్ల మోత, విజిల్స్‌తో థియేటర్స్ మార్మోగుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకూ అందరినీ ఆకట్టుకుంటూ ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ ర్యాంపేజ్‌లో దూసుకెళ్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ను కొత్త స్థాయిలో డిఫైన్ చేస్తోందనే మాట ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా శర్వానంద్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కథనంలో ఉన్న హాస్యం, ఎమోషన్, డ్రామా అన్నీ.. సినిమాను పూర్తి స్థాయి పండుగ ఎంటర్‌టైనర్‌గా నిలబెట్టాయి. శర్వాతో పాటు సమ్యూక్త, సాక్షి వైద్య కీలక పాత్రల్లో మెప్పించారు.
Also Read
- Sandeep Reddy Vanga : ప్రభాస్ 'స్పిరిట్' కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Jagame Sangeetham : "శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్".. గూస్బంప్స్ తెప్పిస్తోన్న 'జగమే సంగీతం' ట్రైలర్!
Also Read: Funky Release Date: ‘ఫంకీ’ కొత్త పోస్టర్.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
నారి నారి నడుమ మురారి చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా.. కథనం, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందని ప్రశంసలు అందుతున్నాయి. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా యాజిన్ నిజార్ గాత్రంతో వచ్చిన పాటలు థియేటర్లలో మంచి స్పందన పొందుతున్నాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయగా.. బాక్సాఫీస్ వద్ద కూడా అంచనాలకు మించిన వసూళ్లు రాబడుతోంది. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, పండుగ వైబ్ అన్నింటిని సమపాళ్లలో మేళవించిన ఈ చిత్రం ‘బొమ్మా బ్లాక్‌బస్టర్’ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించిన చిత్రంగా ‘నారి నారి నడుమ మురారి’ నిలిచిందని ఫాన్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!