ఏపీబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో “సంక్రాంతి సంబరాలు” ముగింపు కార్యక్రమలకు గుడివాడ వెళ్తున్న బీజేపీ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడారు. పోలీసులు ఏ నిబంధనలతో బీజేపీ నాయకులను అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి బస్సుల్లో తరలించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడమేంటని ఆయన మండిపడ్డారు. అధికార దాహానికి, అధికార మదానికి హద్దు ఉంటుందని వైసీపీకి చురకలంటించారు.…
హిందూత్వ అనే అంశంపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య వివాదం చెలరేగింది. హిందూత్వ అంశంపై పోటీ పడి వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరో అడుగు ముందుకు వేసి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ అంశంపై పోటీ చేస్తున్న ఏకైక పార్టీ శివసేన అని అన్నారు. బీజేపీలోని నవ హిందూత్వవాదులకు అసలు హిందూత్వమంటే అర్థం తెలియదని, సమయం వచ్చినపుడు తప్పకుండా వారికి అర్ధాన్ని వివరిస్తామని అన్నారు. కొందరు అవివేకులు తమ చరిత్రను తామే…
వేములవాడ రాజన్న సిరిసిల్లా జిల్లాలో రాజరాజేశ్వర స్వామి దర్శన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. అన్ని సర్వే సంస్థలు బీజేపీ అధికారంలోకి రాబోతుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. సర్వేల రిపోర్టుతో కేసీఆర్ ఖంగుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు దిగజారిపోతుంది. కార్యకర్తల త్యాగాల ఫలితంగా రానున్న రోజులు బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.…
బీజేపీ ప్రభుత్వ అకృత్యాల పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థను అమ్మేయాలనే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి గొడ్డలిపెట్టులా సింగరేణి సంస్థను అమ్మేసే ప్రయత్నం చేస్తుందన్నారు. లాభాల్లో నడిచే సంస్థలను ప్రవేట్ పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయాన్ని సింగరేణి కార్మికులు తీవ్రంగా…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ నాస్తికుల రాజ్యాంగ మారిపోయిందన్నారు. సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం 400 కోట్లు కేటాయిస్తా అన్నాడు…ఊహ చిత్రాలు మాత్రమే చూపించాడని ఎద్దేవా చేశారు. మేడారం జాతర కంటే ముందుగా రాజన్నను దర్శించుకోవడం…
బీజేపీ పై మండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని, అధికారులను బ్లాక్ మెయిలింగ్ చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. రాష్ట్రాలకు ఉన్న అధికారాన్ని మొత్తం లాగేసుకునే కుట్ర బీజేపీ చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంతటి నియంత పాలనను….ఎప్పుడూ చూడలేదని, బీజేపీ వైఖరి మారక…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించిన ప్రభుత్వాలు 2001లో రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రేరేపించాయి. స్వరాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణపై ఆంధ్రా నాయకుల రాజకీయ ఆధిపత్యం అంతరించి, కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. కానీ, తెలంగాణకు జరిగిన అన్యాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ అన్ని రంగాలలో అపూర్వమైన పురోగతిని సాధించింది. కొత్త రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన సహాయాన్ని కేంద్రప్రభుత్వం అందజేసి ఉంటే ఇప్పటికి తెలంగాణ ఊహించని విధంగా పురోగతి సాధించేది. కేంద్ర ప్రభుత్వం…
స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే, శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ ఆదివారం పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేతాజీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అనేక స్వాతంత్ర్య పోరాటాలు చేపట్టారని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి అనేకమంది స్ఫూర్తినిచ్చారన్నారు. దురదృష్టవశాత్తూ ఇలాంటి స్వాతంత్ర్య సమరయోధులను ప్రజలు మరిచిపోయేలా చేసింది కాంగ్రెస్’ అని రాజా సింగ్ ఆరోపించారు.…
ఆత్మకూరు ఘటనలో ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు ఏపీ బీజేపీ కార్యాచరణ సిద్దం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్ రేపు కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మురళీధరన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. కడప జైలులో ఉన్న నంద్యాల పార్లమెంటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇతర నేతలను కేంద్ర మంత్రి మురళీధరన్ పరామర్శిస్తారు. కడప…