మెట్రో పిల్లర్లు కూడా టీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారు.. అధికారం ఉందని, డబ్బు ఉందని మీరు చేస్తున్న ప్రతి దానిని ప్రజలు గమనిస్తున్నారు.. వాళ్లు చీప్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు బీజేపీ నేత లక్ష్మణ్
ఇప్పుడే దేశవ్యాప్తం ప్రజలు మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు. తాజాగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. సభ్యులు వారివారి సీట్లలో కూర్చున్న తరువాత ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఏ కారణం చేతనైనా ప్రత్యేక…
క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారతదేశం ఆర్ధికంగా శక్తి వంతంగా నిలవడానికి పీవీ నరసింహారావే కారణమని పేర్కొన్నారు. భూ సంస్కరణలు తేవడమేకాకుండా.. భూమి లేని పేదలకు భూమి ఇచ్చారన్నారని అన్నారు. యువత ప్రపంచ దేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు…
మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.. గౌహతి నుంచే రెబల్ ఎమ్మెల్యేలు రాజకీయం నడుపుతున్నారు.. మరోవైపు అధికారం ఛేజారకుండా ఎత్తుకు పై ఎత్తులు వేసే ప్లాన్‌లో ఉద్దశ్ థాక్రే శిబిరం ఉంది.. వారికి సీనియర్ పొలిటీషియన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సలహాలు ఇస్తున్నారట.. మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని చూస్తోన్న భారతీయ జనతా పార్టీ.. రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేల సహకారంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది.. దీని కోసం ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు…
మంచు మోహన్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇటీవల కాలంలో రాజకీయాల్లో వైసీపీకి మద్దతిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా మోహన్‌బాబు వైసీపీకి మద్దతిచ్చారు. పలు మార్లు సీఎం జగన్‌ను కూడా కలిశారు. అయితే తాజాగా మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఓ కేసు సందర్భంగా తిరుపతికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీ మనిషిని అంటూ ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడిని…
నేడు రైతులకు పెట్టుబడి పైసలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. తొలిరోజు ఎకరం భూమి ఉన్న రైతులకు ఎప్పటిలాగే పైసలు పడనున్నాయి. క్రమపద్దతిలో రైతులందరికీ జమ చేయనున్నారు. అయితే.. ఈ ఏడాది కొత్తగా 3064లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందనుంది. అయితే గత సీజన్ తో పోల్చితే లబ్దిదారులైన రైతుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు నిధుల మొత్తం కూడా పెరిగింది. ఇప్పుడు ఈ వానకాలం సీజన్‌కు రైతుబంధుకు…
తెలంగాణకు కేంద్రం ఎక్కువ ఇచ్చిందా.. రాష్ట్రం తెలంగాణకు ఎక్కువ ఇచ్చిందా.. కేంద్రం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.. కేంద్రానికి తెలంగాణ ఇచ్చిన దానికంటే, వాళ్లు ఎక్కువ ఇచ్చినట్లు చూపెడితే.. నా మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్తానని ఓపెస్ చాలెంజ్ విసిరారు..
బంగారు భవిష్యత్తు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. జులై 2 ,3 వ తేదీన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా ఆమో మీడియాతో మాట్లాడారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు పనులు ప్రారంభం ఆయ్యాయని తెలిపారు. మోడి తో పాటు బీజేపీ ముఖ్యమంత్రులు, జాతీయ పదధికారులు,కేంద్ర మంత్రులు పాల్గొన్నారని పేర్కొన్నారు. 3 వ తేదీన కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం ఫెరడ్ బీజేపీ బహిరంగ సభ వుంటుందని డీకే…
రాష్ట్రపతి ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ద్రౌపతి ముర్మును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముర్ము తన ప్రచారంలో బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా మద్దతు సంపాదించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే సోమవారం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ లో నామినేషన్ దాఖలు చేశారు. యశ్వంత్ సిన్హా వెంట ప్రతిపక్షాల ప్రధాన నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,…