ప్రధాని మోదీ జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో.. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్లో బసకు ఏర్పాటు చేసారు అధికారులు. మోడీ రాకకు ముందుగా నిన్న (బుధవార)మే హైదరాబాద్‌కు చేరుకున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బృందాలు నోవాటెల్ హోటల్లో స్థానిక పోలీసులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో.. ప్రధానితోపాటు పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు రానున్న సందర్భంగా.. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అయితే.. రాజ్‌భవన్‌లోనే మోడీ బస చేస్తారని తొలుత భావించారు.…
హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలకు జీహెచ్ఎంసీ చలానాలు జారీ చేస్తోంది. కొద్దిరోజుల ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ‘సాలు దొరా.. సెలవు దొరా’అంటూ పెట్టిన డిజిటల్ డిస్ప్లే బోర్డుకు రూ.50 వేలు, ప్రధాని మోదీ– బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫొటోలతో ఉన్న బ్యానర్, కటౌట్లకు రూ.5 వేలు కలిపి రూ.55 వేల జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లపై పౌరుల ఫిర్యాదు…
నగరంలో కాషాయి జెండాలు రెపరెపలాడుతున్నాయి. జూలై 3న బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించేందుకు భారీ ఏర్పట్లపై బీజేపీ శ్రేణులు పకడ్బందీ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. నగరంలో ఎక్కడ చూసిన కాషాయి జెండాలు రెపరెపలాడుతుండటంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరికి పార్టీ చేరువయ్యేలా కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్నారు బీజేపీ శ్రేణులు. మోదీ సభకు భారీగా జనాన్ని తరలించడానికి పార్టీ జాతీయ నాయకత్వం పకడ్బందీ వ్యూహంతో ప్రణాళికలు…
* ఉదయం 11 గంటలకు దేవేంద్ర ఫద్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం, కోర్ కమిటీ సమావేశం తర్వాత దేవేంద్ర ఫద్నవీస్ ప్రెస్ మీట్ * నేడు తెలంగాణ టెన్త్ ఫలితాలు, ఉదయం 11.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి * నేటి నుంచి తెలంగాణలో బోనాలు ప్రారంభం * నేడు సాయంత్రం 6 గంటలకు పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం, కొనసాగుతోన్న కౌంట్‌డౌన్ * శ్రీకాకుళం జిల్లా పలాసలో నేడు వైసీపీ…
ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముస్లిం సంస్థలు సహా ప్రతిఒక్కరూ ఈ ఘటనని ఖండిస్తున్నారు. ఇప్పుడు ఈ ఉదంతంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. హింస, ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని.. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. చట్టం తన పని చేసుకుపోతుందన్న ఆమె.. ప్రతి ఒక్కరినీ శాంతిని కాపాడాలని కోరుతూ ట్వీట్ చేశారు. మరోవైపు.. మంగళవారం…
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం మరోసారి తెరపైకి వచ్చింది.. గత కొంతకాలంగా విశ్వేశ్వర్‌రెడ్డి చేరికపై వార్తలు వస్తూనే ఉన్నాయి.. అధిష్టానం నుంచి పెద్ద లీడర్లు ఎవరు రాష్ట్రానికి వచ్చినా.. ఆయన సమక్షంలో కొండా బీజేపీ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగుతూ వచ్చింది.. ఈ మధ్య పాదయాత్రలో ఉన్న బండి సంజయ్‌ని కలిశారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో.. ఆయన బీజేపీలో చేరడం…
తన రూటే సెపరేటు అనే హీరో మోహన్ బాబు.. తాజాగా తిరుపతిలో అదే చేశారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వ్యవహారించారనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కోర్టు వాయిదాకు ఇద్దరు కుమారులతో కలిసి హాజరైన ఆయన.. కొంత దూరం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు.. రకరకాల ఊహాగానాలకు తెరతీశాయి. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్‌గా ఉంటూ.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మోహన్‌బాబు.. గత ఎన్నికల్లో వైసీపీకి జై కొట్టారు.…
దాదాపు తొమ్మిది నెలల తర్వాత ముఖ్యమంత్రి కేసియార్ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టారు. కీలక సందర్భాల్లోనూ అటు వైపు చూడకపోవడంతో దూరం మరింత పెరిగింది. కేబినెట్ ప్రతిపాదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని చాలాకాలంపాటు పెండింగ్‌లో ఉంచడంతో ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలవలేదు. గవర్నర్ వెళ్లిన సమ్మక్క సారక్క జాతరలోనూ.. భద్రాచలం పర్యటనలోనూ ప్రొటోకాల్ కనపడలేదు. మంత్రులు…అధికారులు గవర్నర్ వచ్చే సమయానికి మాయం అయ్యారు. తమకు సమాచారం ఇవ్వకుండా వస్తున్నారని చెప్పుకొన్నారు. మరో అభ్యర్థిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో పంపిన తర్వాత ప్రభుత్వం గవర్నర్…