Bengal Violence: గత కొన్ని రోజులుగా బెంగాల్లో వక్ఫ్ వ్యతిరేక నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్ జిల్లాలో హింస తీవ్రంగా మారింది. ఆందోళనకారుల ముసుగులో పలువురు అల్లర్లకు పాల్పడ్డారు. మమతా బెనర్జీ ముస్లిం బుజ్జగింపు వల్లే ఇలాంటి అల్లర్లు జరుగుతున్నాయని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. 150 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Bengal Waqf Violence: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. నిరసనల పేరుతో హిందువుల ఇళ్లను, ఆస్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ శాంతియుతంగా ఉండాలని ఆందోళనకారుల్ని కోరినప్పటికీ సమస్య సద్దుమణగడం లేదు. వక్ఫ్ బిల్లును రాష్ట్రంలో అమలు చేయమని ఆమె ఆందోళనకారులకు చెప్పారు. అయినప్పటికీ, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ‘‘వక్ఫ్ బిల్లును మా పార్టీ వ్యతిరేకించింది. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. మీరు కావాలంటే కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకోండి’’…
లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన హింసను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ముగ్గురు హిందువులను వారి ఇంటి నుంచి బయటకు లాగి దారుణంగా హత్య చేశారన్నారు. లక్నోలో బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సమ్మాన్ అభియాన్ కింద నిర్వహించిన రాష్ట్ర వర్క్‌షాప్‌లో బీజేపీ నాయకులను ఉద్దేశించి సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్తపై మాజీ ముఖ్యమంత్రి అతిశీ సంచలన ఆరోపణలు చేశారు. రేఖాగుప్తా భర్త మనీష్ గుప్తా అనధికారంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. పలువురు అధికారులతో మనీష్ గుప్తా సమావేశమైన ఫొటోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Bengal Waqf Violence: వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో నిర్వహిస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్ ప్రాంతంలో హింస పెరిగింది. ఈ ఘర్షణల్లో ముగ్గురు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిరసనకారులు ఇద్దరు తండ్రికొడుకులను నరికి చంపారు. ముస్లిం మెజారిటీ ఉన్న ముర్షిదాబాద్‌లో శుక్రవారం జరిగిన హింసాకాండకు సంబంధించి 118 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ నియోజకవర్గంలో కూటమి పార్టీ శ్రేణులు అర్ధరాత్రి రోడ్డెక్కి దందా చేస్తున్నారా ? ఎమ్మెల్యే పేరును…ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారా ? వరుసగా జరుగుతున్నఘటనలతో ఆ ఎమ్మెల్యేకి చెడ్డపేరు వస్తోందా ? ఇంతకీ పార్టీ శ్రేణుల దందా శాసనసభ్యుడి తెలుసా ? అర్ధరాత్రి వసూళ్ల వ్యవహారంపై కూటమి ఎమ్మెల్యే మౌనమెందుకు ? కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నిత్యం వార్తల్లో ఉంటోంది. వైసీపీ హయాంలో భూ ఆక్రమణలు, ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యాలతో తరచూ వార్తల్లో నిలిచేసింది. కూటమి…
MK Stalin: తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తను శుక్రవారం అమిత్ షా ప్రకటించారు. రెండు పార్టీలు కలిసి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ పొత్తుపై అధికార డీఎంకే పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ పొత్తుని ‘‘ఓటమి అవినీతి కూటమి’’గా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. అధికారం కోసమే ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని ఆరోపించాడు.
కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కేటీఆర్ కి దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి కదా? అని సవాల్ చేశారు.. ఎవరి గురించి మాట్లాడాడో చెప్పకుండా... ఒక ఎంపీ అని గాలివార్త చెప్తే సరిపోదు కదా..? అని నిలదీశారు..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను గౌరవించింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చి పార్లమెంట్లో ఆయన చిత్రపటం పెట్టాం అని, 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. 106 సార్లు సవరణ జరిగిన రాజ్యాంగంలో అధిక శాతం కాంగ్రెస్ స్వలాభం కోసం సవరణలు జరిగాయని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ కాలంలో జరిగిన 22 సవరణలు సామాజిక న్యాయం…
త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి తలపడనున్నాయి. ఇప్పటికే రెండు దశాబ్దాలకు పైగా నితీష్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తోంది.