Bandi Sanjay: మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్. పార్టీల మధ్య ప్రచార జోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలో ఇప్పటికే పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ.. ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీకీలక నేతలను రంగంలోకి దింపుతున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్ లోకి కీలక నేతలంగా నియోజక వర్గంలోనే మకాం వేసి మరీ ఇంచార్జుల వారీగా ప్రచారం చేస్తు దూసుకుపోతున్నారు.
Read also: Paritala Sriram And Vangaveeti Radha: ఈ ఇద్దరి కలయిక ఏపీలో హాట్ టాపిక్ అవుతుందా?
ఇక మునుగోడులో.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు , కాషాయం పార్టీకూడా గట్టిగానే ప్రచారం చేస్తూ హోరెత్తిస్తున్నారు. అధికార పార్టీపై విమర్శలు చేస్తూ.. నిప్పులు చెరుగుతూ.. గళం వినిపిస్తున్నారు. అయితే.. ఇన్నిరోజులు బండి సంజయ్ ప్రచారంలో పూర్తి స్థాయిలో పాల్గొనలేదు. దీంతో రంగంలోకి దిగేందుకు సన్నద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ పర్యటలో ఉన్న విషయం తెలిసిందే. దాంతో, మునుగోడు ప్రచారంలో పూర్తి స్థాయిలో పాల్గొనలేదు బండి సంజయ్. రేపటి నుంచి బండి సంజయ్ మునుగోడులో ప్రచారం చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఇవాళ సాయంత్రం మునుగోడుకు బయలుదేరనున్నారు బండిసంజయ్. 12 రోజుల పాటు రోడ్ షోలతో బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపుతూనే.. ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు బీజేపీ శ్రేణులు.
Astrology: అక్టోబర్ 17, సోమవారం దినఫలాలు