Kadiyam Srihari: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ఎనిమిదేళ్ల పాలన పూర్తయిందని, ఈ ఎనిమిదేళ్లలో ఏ రంగం అభివృద్ధి చెందలేదన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన ఎంపీ లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ ఎం.ఎస్. ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ వీజీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎనిమిదేళ్లలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయిందని, మోడీ ప్రధాని అయ్యాక డాలర్ విలువ 58 రూపాయలుగా ఉందన్నారు. ఇప్పుడు డాలర్ విలువ 82 రూపాయలకు చేరిందని విమర్శించారు. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. 2014లో 7 శాతంగా ఉన్న ఆర్థిక వృద్ధి రేటు ఇప్పుడు 5 శాతానికి పడిపోయింది. బీజేపీ నేతలు ఒప్పుకోకపోయినా ఇవి నిజాలు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 121 దేశాలలో భారతదేశం 107వ స్థానంలో ఉంది. 2014లో, మేము హంగర్ ఇండెక్స్‌లో 55వ స్థానంలో ఉన్నాము. ఆసియా దేశాల్లో, పొరుగు దేశాలతో పోలిస్తే హంగర్ ఇండెక్స్ భారత్ స్థానం దిగజారింది.
Read also: Boora Narsaiah Goud: ఈనెల 19న బీజేపీ కండువా కప్పుకోనున్న బూర నర్సయ్యగౌడ్
హ్యాపీనెస్ సూచికలో మనం 136వ స్థానంలో ఉన్నాం. 2014లో 117వ స్థానంలో ఉన్నాం. అసమానత తగ్గింపు సూచికలో మేము 123వ స్థానంలో ఉన్నాము. మానవాభివృద్ధి సూచికలో మనం 133వ స్థానంలో ఉన్నాం. మొత్తానికి మోడీ పాలన భారతదేశాన్ని అధోగతి పాలు చేసింది. డాలర్ బలపడటం వల్లనే రూపాయి విలువ పడిపోతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రూపాయి విలువ పడిపోవడం వల్ల డాలర్ విలువ పెరుగుతోందని అంటున్నాం.. తేడా ఏంటి? కేటీఆర్ ఆమాట అనడంలో ముమ్మటికీ కరెక్ట్ అని అన్నారు. అయినా కేటీఆర్ మాటలకు మీకు అంత ఉలికి పాటు దేనికని ప్రశ్నించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చమురు ధరలు తగ్గించారా? దేశంలో పరిస్థితులు దిగజారిపోతుంటే.. ఓహో మోడీ అంటూ బీజేపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట మసకబారింది. బీజేపీ అధికార దాహం, రాజగోపాల్ రెడ్డి అహంకారం మొన్నటి ఉప ఎన్నికకు కారణమైంది. కాంగ్రెస్‌లో ఉండగా బీజేపీ కోవర్టుగా పనిచేసిన తనకు 18వేల కాంట్రాక్టు దక్కిన మాట వాస్తవమేనని రాజగోపాల్‌రెడ్డి అంగీకరించారు.
Vallabhaneni Vamsi: వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా