Farooq Abdullah on Pathaan controversy: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’మూవీ వివాదాస్పదం అయింది. ఈ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాటు ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ పాటలో హీరోయిన్ దీపికా పదుకొణె కాషాయరంగు బికినీలో కనిపించడంతో పాటు పాటలో అసభ్యత ఎక్కువగా ఉండటంతో హిందూ సంస్థలు, బీజేపీ పార్టీ ఈ పాటను తొలగించాలని లేకపోతే సినిమాను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ముస్లిం సంఘాలు కూడా ఈ పాటపై అభ్యంతరం…
ఉపాధిహామీ పథకం.. తెలంగాణ ప్రభుత్వానికి అక్షయ పాత్రగా మారింది బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. రైతు కల్లాలు ఎక్కడ ఉన్నాయి ? అని ప్రశ్నించారు. బిల్లులు ఎత్తుకున్నారు ? చట్ట వ్యతిరేకంగా వాడారు ? కల్లాల పేరుతో బీఆర్ఎస్ నేతలు తిన్నది అడిగితే.. కేంద్రం రైతు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య.. మాటల యుద్ధంతో పాటు సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా చెప్పుతో కొట్టుకునే వ్యాఖ్యలు రచ్చ చేస్తున్నాయి.. ఇప్పుడు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బహిరంగ సవాల్ విసిరారు.. మా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.. ఈ రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు చూపించిన నేను రాజీనామా చేస్తాను…
Niranjan Reddy criticizes BJP and Kishan Reddy: ఉపాధి హామీ పనుల కింద కల్లాల నిర్మానాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని.. కానీ ఈ పనులు చేయడానికి వీలు లేదని కేంద్రం తెలంగాణకు నోటీసులు ఇచ్చింది.. రైతుల కోసం కల్లాలు కట్టడం నేరామా..? అని ప్రశ్నించారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఉపాధి హమీ పనుల్లో వ్యవసాయ ఉత్పత్తి పెంచే పనులు చేసుకోవచ్చని చట్టం చెబుతోందని ఆయన అన్నారు. అయినా కేంద్రం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
Minister Harish Rao criticizes BJP: తెలంగాణ రాకపోతే మహబూబ్ నగర్ కు మెడికల్ కాలేజీలు వచ్చేవా..? అని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. మహబూబ్ నగర్ లో గురువారం 1000 పడకల సూపర్ స్పెషాలిటి ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. రూ.300 కోట్లతో ఆస్పత్రిని నిర్మిస్తున్నామని అన్నారు. క్యాన్సర్ తో పాటు అన్ని రకాల వైద్యసేవలు ఇక్కడే అందుబాటులో ఉంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి మెడికల్ మహబూబ్ నగర్ కి…
Bandi Sanjay criticizes Minister KTR: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా ఉంది. ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్, కేటీఆర్ పై విమర్శలు చేశారు. కేటీఆర్ విత్ డ్రావల్ సిమ్టమ్స్ తో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే పిచ్చిపిచ్చిగా వాగుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన…