తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ హైకమాండ్ తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్‌లను నియమించింది. తెలంగాణలో బీజేపీ సీనియర్లను సైతం పాలక్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. తాజాగా నేడు నిర్వహించిన బీజేపీ సమావేశంలో టీడీపీ పొత్తుపై హాట్‌హాట్ చర్చ జరిగింది.
Also Read : Off The Record about Anam Ramanarayana Reddy: ఆనం అసంతృప్తి ఎవరి మీద? తప్పుకోవడానికే అలా మాట్లాడుతున్నారా?
టీడీపీతో పొత్తుపై స్పష్టత ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరారు మాజీ ఎంపీ విజయశాంతి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తుతో హస్తం పార్టీ నష్టపోయిందని విజయశాంతి తెలిపారు. అయితే.. విజయశాంతి కొరిన విధంగా టీడీపీతో పొత్తుపై స్పష్టత ఇవ్వాలని ఎంపీ అర్వింద్ కూడా కోరారు. అయితే.. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ స్పందిస్తూ.. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. కార్యకర్తలకు ఈ విషయాన్ని చెప్పండని సూచించారు.
Also Read : Jammu & Kashmir Snowfall : జమ్మూలో హిమపాతం.. మూసుకుపోయిన శ్రీనగర్-లేహ్ రోడ్డు