యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో పార్లమెంటు ప్రవాస్ యోజన కార్యక్రమంలో ముఖ్యనేతలతో సమావేశ కార్యక్రమం పార్లమెంట్ ఇంచార్జ్ చింతల రామచంద్రా రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బంగారు శ్రుతి నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో నల్లగొండలో ఒక్క సీటు కూడా బీఆర్‌ఎస్ పార్టీ గెలువదన్నారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా పోరపాటున కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఓటేయకండన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలలో 420 ఎంపీ సీట్లు మా లక్ష్యమని, నేను బీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్నపుడు కూడా బీజేపీ నిధులతోనే అభివృద్ధి చేశాం అందరికి తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళన కేవలం ప్రకటనలకే మిగిలి పోయాయని, చౌటుప్పల్ కాలుష్య కంపెనీ ల బదులు ఇక్కడి ప్రజలకు నిధులేమో సిరిసిల్ల, సిద్దిపేట్, గజ్వేల్ కి ఇస్తారన్నారు. అంతేకాకుండా.. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపియడానికి ప్రజలు సిద్ధంగా వున్నారన్నారు.
Also Read : Water Parks: ఈ వేసవిలో హైదరాబాద్‌లో సందర్శించాల్సిన 10 వాటర్ పార్క్స్
అనంతరం.. పార్లమెంట్ ఇంఛార్జి చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘ తొమ్మిది సంవత్సరాలుగా ట్యాంక్ బండ్ పై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయని కెసిఆర్ కేవలం ఎలక్షన్ల కోసం 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రారంభించారు. దళిత సంఘాలను, కుల సంఘాలను పిలవకుండా కేవలం రాజకీయం కోసమే అంబేద్కర్ విగ్రహ రాజకీయం చేశారు. బాబు జగ్జివన్ రావు విగ్రహానికి పూలమాల వేయలేదు. కేంద్ర ప్రభుత్వం నుండి 2.25 వేల ఇండ్లకు నిధులు పంపిస్తే తిరిగి వెనక్కి పంపించారు. 12000 వేల కోట్లు ఆర్బన్ నిధులు వచ్చాయ్ కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. హైదరాబాద్ జంట నగరాలకు 30 టీఎంసీల రెండు రిజర్వాయర్ కట్టిస్తా అన్నవ్ ఎక్కడ కట్టించారు. కోటి ఏకరాలకు నీళ్ళు ఇస్తా అన్న నువ్వు ఎక్కడ ఇచ్చావ్. పేపర్ లీకేజి ను నిలదీసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. ఆయన ఫోన్ ఎక్కడ పోయింది.
దీనికి సమాధానం చెప్పాలి. అభివృద్ధి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోనే అయ్యింది. వాల్మీకి అంబెడ్కర్ ఆవాష్ యోజన కింద నీరు పేదలకు ఇండ్లు ఇచ్చాం. మంజీర, శామీర్ పేట జలాశయాలకు ఆనాడే 35 కోట్ల నిధులతో మంచి నీళ్ళు అందించాం. 140 కోట్ల భారతీయుల కోసం ప్రధాన మంత్రి ఆలోచిస్తారు. నిన్ను గద్దె దింపడానికి బూత్ స్థాయి లో కమిటీ వేసుకుంటున్నాము. మైనార్టీ,sc,st,bc, అన్న స్థాయి లలో కమిటీ వేసుకుంటున్నాము. రాబోవు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేది బీజేపీ పార్టీనే.’ అని ఆయన అన్నారు.