ఛత్తీస్‌గఢ్‌లో 2018లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోవడానికి ముందు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోను రూపొందించేందుకు 31 మంది సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హర్యానాలోని సోనేపట్ జిల్లా మదీనా గ్రామంలో రెండ్రోజుల క్రితం వరి నాట్లు వేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మంది కెమెరామెన్లు అతన్ని వీడియోలు, ఫొటోలు తీశారు. అయితే రాహుల్ గాంధీ నాట్లు వేయడంపై బీజేపీ కామెంట్స్ చేస్తుంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విట్టర్లో రాహుల్ గాంధీని హేళన చేస్తూ.. ఓ వీడియో పోస్ట్ చేశారు.
అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ రూ.100 కోట్లు ఖర్చు చేసిందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పై కేంద్ర సంస్థలు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు.. ఈ విషయంలో బీజేపీకి నోటీసులు జారీ చేస్తారా? విచారణ జరిపిస్తారా?.. ప్రధాన మంత్రి మోడీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డురంగా ఉంది-మంత్రి కేటీఆర్
రాజకీయ పార్టీ అభివృద్ది కేవలం యువతతోనే సాధ్యమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టడంతో యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు చేయాల్సిన ఉద్యోగ భర్తీలు కూడా ఇప్పటి వరకు భర్తీ చేయలేదు అని జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థ ఇప్పటికీ అలానే ఉంది. శాసన సభ వేదికగా సిఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీ కూడా పూర్తి…
వరంగల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మేము అవినీతి చేశామని ప్రధాని మోడీ అంటున్నారు కదా.. దర్యాప్తు సంస్థలు అన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా?.. ఏమి చేస్తున్నారు?.. మీరు అని ఆయన ప్రశ్నించారు.
వరంగల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన తర్వాత తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. దీంతో పాటు పార్టీ పటిష్టత కోసం కమలనాథులు తెలంగాణలో వరుస సమావేశాలు, పర్యటనలు చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ పార్టీ మారుతున్నారనే ప్రచారంతో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇవాళ (ఆదివారం) ఆయన నివాసానికి వెళ్లి ఇద్దరు కాసేపు చర్చించుకున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరో నాటకానికి తెర దీసింది అని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం మీటింగ్ సందర్భంగా బీఆర్ఎస్ అరాచకాలు చేసింది.. బీఆర్ఎస్ అరాచకం వల్లనే సభ గ్రాంఢ్ సక్సెస్ అయ్యింది అని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వున్న కిషన్ రెడికే బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ హైకమాండ్ నియమించింది అని తెలిపింది. ఇదే బీఆర్ఎస్, బీజేపీ అనుబందంపై పూర్తిగా అర్థమవుతుందని రేణుకా చౌదరి చెప్పారు. బీఆర్ఎస్ కు కరెంట్…
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర హింస చెలరేగింది. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో పలు జిల్లాలో రాజకీయ కక్షలు పెరిగాయి.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించిన బండి సంజయ్‌కు అదిష్టానం మరో కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ జాతీయ కార్యవర్గంలో సంజయ్‌కు స్థానం కల్పించారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ హైకమాండ్ ఫుల్ నజర్ పెట్టింది. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసిన బీజేపీ పార్టీ ఇక జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.