Bhuma Kishore Reddy: అఖిల ప్రియకు వ్యతిరేకంగా రంగంలోకి భూమా కుటుంబం.. మా మద్దతు కిషోర్‌రెడ్డికే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuma Kishore Reddy: మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు వ్యతిరేకంగా సమీప భూమా కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు.. నంద్యాలలో ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. భూమా కుటుంబంతో అఖిల ప్రియకు సంబంధం లేదంటున్నారు భూమా నాగిరెడ్డి సోదరి శ్రీదేవి.. మా భూమా కుటుంబం అంత భమా కిషోర్ రెడ్డికే మద్దతు ఇస్తుందన్నారు. అఖిల ప్రియకు మద్దతు ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు. అఖిల ప్రియ.. భూమా కుటుంబానికి చెందినామే కాదు, తన భర్త మద్దూర్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు భూమా నాగిరెడ్డి సోదరి శ్రీదేవి..
Read Also: YCP 5th List Tension: వైసీపీ ఐదో జాబితాపై కసరత్తు.. సీఎంవోలో కీలక నేతలు.. సిట్టింగ్‌ల్లో టెన్షన్..!
Also Read
భూమా కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉండేది నేనే.. ఫిబ్రవరి 7 లేదా 9వ తేదీల నుండి ప్రజల్లోకి ప్రచారానికి సిద్ధం అవుతున్నట్టు ప్రకటించారు ఆళ్లగడ్డ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇంఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి.. అంతేకానీ, మద్దూరు అఖిల ప్రియ, భార్గవ్ రామ్ నాయుడుతో సంబంధం లేదన్నారు. భూమా కుటుంబం అంటే మేమే, మద్దూరు అఖిల ప్రియ కాదు అన్నారు. మద్దూరు అఖిల ప్రియ చేసిన ఘోరాలు అందరికీ తెలుసు.. అందుకే ఆమెను మా ఫ్యామిలీ పక్కన పెట్టిందన్నారు. పొత్తులో భాగంగా బీజేపీ అధిష్ఠానం నాకు సీటు ఇవ్వకపోతే.. ఇండిపెండెడ్ గా అయినా పోటీ చేస్తాను.. కానీ, అఖిల ప్రియకు మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు భూమా కిషోర్ రెడ్డి. కాగా, త్వరలోనే ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. భూమా కుటుంబంలో ఇప్పుడు తాజా పరిణామాలు కాకరేపుతున్నాయి..
తాజావార్తలు
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!