అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఒకే రోజు పరిమితం చేయడం పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆరోపించారు.
రాజకీయంగా బీజేపీ విజయాల్ని చూసి ఆరెస్సెస్ సంతోషించే మాట వాస్తవం. వీలైనంత వరకు పార్టీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలనే విధానం కూడా కొంతవరకూ నిజమే. కానీ బీజేపీకి కాస్త స్వేచ్ఛ ఇచ్చినప్పుడల్లా.. మూలాలు మరిచిపోయి.. సంఘ్ సిద్ధాంతాలతో సంబంధం లేని నేతల్ని పార్టీలో చేర్చుకోవడం, వారి ప్రాధాన్యత పెరగటం ఆరెస్సెస్ ను అసంతృప్తికి గురిచేసేది. అందుకే ఎప్పటికప్పుడు బీజేపీలో జరిగే వ్యవహారాలపై ఆరెస్సెస్ నిరంతర పరిశీలన ఉంటుంది. అలాగే అవసరమైనప్పుడు సలహాలు కూడా ఇస్తుంది.
బీహార్లో ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజకీయాలు హీటెక్కుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు.
2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడింది. మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇండియా కూటమి కూడా బాగానే బలం పుంజుకుంది. కాంగ్రెస్కు కూడా ఆశించిన స్థాయిలోనే సీట్లొచ్చాయి. ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.
దేశంలో ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్లో ఉన్న నాయకులు 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలన్న చర్చ తీవ్రంగా నడుస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్పై చర్చ నడుస్తోంది. తాజాగా దీనిపై మోహన్ భాగవత్ క్లారిటీ ఇచ్చేశారు.
తెలంగాణలో కమలం కట్టు తప్పుతోందా? క్రమ శిక్షణకు కేరాఫ్ అని చెప్పుకునే పార్టీలో ఇక అది భూతద్దం పెట్టి వెదికినా కనిపించే అవకాశాలు ఉండవా? పార్టీ పెద్దలే అందుకు ఊతం ఇస్తున్నారా? దారిన పెట్టాల్సి వాళ్ళే గాడి తప్పుతున్నారా? రాష్ట్ర పార్టీలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీలో అంతర్గత రచ్చ... అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
బీహార్లో బడుగు బలహీనవర్గాల ప్రజల ఓట్లే తొలగించారని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ అధికార్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ బీహార్లో పర్యటిస్తున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు పడతాయి... కానీ, ఒక్క ఏపీలోనే ఎన్డీఏ అభ్యర్థికి వన్ సైడ్ ఓట్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ.. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ కొత్త నిర్వచనం చెప్పి ఆయన.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని కించపరిచే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారు..
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే ఈలోపే బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. బీహార్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే కొత్త అధ్యక్షుడిని నియమించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి.