Dharmasthala: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల వార్తల్లో ప్రధానాంశంగా మారింది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే హోరు. హిందువులకు ఎంతో పవిత్రమైన స్థలంలో వందలాది మృతదేహాలను బలవంతంగా ఖననం చేశానని అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించడం సంచలనంగా మారింది.
SIR: ఇటీవల బీహార్ రాష్ట్రంలో కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలు చేయడం సంచలనంగా మారింది. అక్రమ ఓటర్ల గుర్తించి, ఎన్నికల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తోంది. అయితే, ఈ ప్రక్రియను ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎన్నికల కమిషన్పై విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ-ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీహార్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా ఎన్నికల సంఘం లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్ర యుద్ధమే చేసింది. అధికార పార్టీతో ఈసీ కుమ్మక్కై ఓట్ల చోరీ చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు.
మన ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి.. మళ్లీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్..
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో మాజీ సీఎం కేసీఆర్పై చర్యలు తీసుకోకుండా.. సీబీఐ విచారణకు ఎందుకు ఇచ్చినట్టు అని ప్రభుత్వంను ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సీబీఐ మీద నమ్మకం లేదన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు అని విమర్శించారు. బీజేపీపై బట్ట కాల్చి మీద వేసేందుకు సీబీఐకి కేసు అప్పగించారని.. సీబీఐకి ఈ ప్రభుత్వం సహకరిస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే చెప్పేందుకు.. ఇదంతా ఒక పన్నాగం అని మండిపడ్డారు. బీఆర్ఎస్ను…
Rahul Gandhi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం ఓటర్లను మోసం చేయడానికి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ‘‘త్వరలో ఓటు చోరిపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’’ ద్వారా బీహార్లో ఓటర్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు అధికార బీజేపీ, ఎన్నిక సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. 65 లక్షల మంది ఓటు హక్కును…
విశాఖలో జరిగిన సేనతో సేనాని సభ తర్వాత.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భవిష్యత్ రాజకీయాలపై పెద్ద చర్చ మొదలైంది. పవన్ కల్యాణ్ నిజంగా జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయాలి అనుకుంటున్నారా..? జనసేనను రాష్ట్ర స్థాయి పార్టీ నుంచి జాతీయ పార్టీగా విస్తరించాలనే ఆలోచనో న్నారా? ఎందుకంటే.. ఆయన పదే పదే చెబుతున్న జనసేనకు జాతీయవాద లక్షణాలున్నాయి అన్న వ్యాఖ్యలు.. ఆయన భవిష్యత్ ప్రణాళికలపై కొత్త సందేహాలు, కొత్త అంచనాలు రేపుతున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ నైతికంగా దిగజారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు.. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పై రాహుల్ గాంధీ అనుచితి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు అంటూ అంటూ ఫైర్ అయ్యారు..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు.
హైదరాబాద్ను బీజేపీ కంచుకోటగా మలచామని, GHMC ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన విషయమే దీనికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి మంచి ఓటు షేర్ రావడం ప్రజలు ప్రత్యామ్నాయంగా కేవలం బీజేపీనే భావిస్తున్నారని ఆయన అన్నారు.