Nara Lokesh: టీడీపీ, బీజేపీ కూటమి బంధం బలంగా ఉందని.. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CPR)కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్ సౌత్ 2025లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీఏలో చేరింది, అందుకు మద్దతు కొనసాగిస్తుంది. మేము ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్ముతాం. కాబట్టి, ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా లేదా ఇతర ఎన్నికలైనా.. మా మద్దతు ఎన్డీఏ అభ్యర్థికే అని లోకేష్ అన్నారు. సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, సరైన నాయకత్వం అన్నింటికీ తేడా చూపిస్తుందని తాము నమ్ముతామని ఆయన చెప్పుకొచ్చారు.
ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తాను తన ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లి సీపీఆర్‌ను అభినందించామని లోకేష్ తెలిపారు. అయినప్పటికీ, ఇండియా కూటమి తరఫున సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించడం రాజకీయాలు అని ఆయన అన్నారు. మేము అలాంటి రాజకీయాలకు లొంగిపోమని లోకేష్ తేల్చి చెప్పారు. సుదర్శన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నప్పటికీ, తమ నినాదం “భారత్ ఫస్ట్” అని స్పష్టం చేశారు.
Gen Z protest in Nepal: ఖాట్మండులో రక్తపాతం.. 16 మంది మృతి, వందలాది మందికి గాయాలు!
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి ప్రస్తుతం మొత్తం ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ 1 రాష్ట్రంగా మార్చడమే ఆయన ఎజెండా అని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో కూడా చెప్పామని.. మేము ‘గల్లీ నాయకులం’, ‘ఢిల్లీ నాయకులం’ కాదని ఆయన అన్నారు. మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఇక్కడ ఉన్నాం. ఈ పుకార్లన్నింటికి ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెడదాం అంటూ పేర్కొన్నారు.
అలాగే భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలు 2029లో జరుగుతాయని లోకేష్ గుర్తు చేశారు. 2029 తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏతోనే ఉంటుందని, తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. ఒక వ్యక్తి చాలా మార్పు తీసుకురాగలడని నేను నమ్ముతాను. చరిత్ర ఇది చూపించింది. సింగపూర్, మలేషియాను చూడండి.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అది చేసి చూపించారు. ప్రధాని మోడీ భారతదేశానికి అవసరమైన సరైన నాయకుడు, సరైన సమయంలో, సరైన చోట ఉన్నారు. మా మద్దతు ఎప్పటికి ఉంటుందని లోకేష్ పేర్కొన్నారు.
A Masterpiece: త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి, కలియుగానికి లింక్ పెడుతూ “ఎ మాస్టర్ పీస్”!