కర్ణాటక అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ నోట ఆర్ఎస్ఎస్కు చెందిన గీతాన్ని ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై రకరకాలైన కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు స్వరం మారింది.. రేపు పార్టీ మారుతుందని కామెంట్లు వస్తున్నాయి.
జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది కమలం పార్టీ... కోరుట్లలో అయితే టైట్ ఫైట్ ఇచ్చి కాంగ్రెస్ని వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక జగిత్యాలలో పోటీ చేసిన భోగా శ్రావణి 43 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇక్కడ మూడో స్థానంలో నిలిచినప్పటికి... కొన్ని గ్రామాలు, జగిత్యాల పట్టణంలో ఆధిక్యత ప్రదర్శించడం కేడర్లో జోష్ నింపింది.
TVK Chief Vijay : టీవీకే పార్టీ చీఫ్ విజయ్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. టీవీకే పార్టీ మానాడు కార్యక్రమంలో విజయ్ పాల్గొన్నారు. ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తమిళనాడులో సింహం వేట మొదలైంది. ఇక నుంచి రణరంగమే జరుగుతుంది. తమిళనాడులోని ప్రతి ఇంటి డోర్ కొడుతాం. అందరినీ కలుపుకునిపోతాం. ఏ పార్టీతోనూ మేం చేతులు కలపం. ఒంటరిగానే పోరాడుతాం.…
బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బెదిరించేందుకే కేంద్రం తొలగింపు బిల్లు తీసుకొచ్చిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూకశ్మీర్ బిల్లు, రాజకీయ నేతల నేరాలపై కీలక బిల్లులను ప్రవేశ పెట్టారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమిపై పోస్ట్ మార్టమ్ చేసిన కాంగ్రెస్ కు.. ఓట్ల చోరీపై కొన్ని ఆధారాలు దొరికాయని రాహుల్ చెబుతున్నారు. ఆయన ఇప్పటికే ఓట్ల చోరీపై ఇండియా కూటమి నేతలకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈసీకి కొన్ని సవాళ్లు కూడా విసిరారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న బీహార్లో ఓటు అధికార యాత్ర మొదలుపెట్టారు రాహుల్.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్ పేరును ఎన్డీఏ కూటమి ప్రకటించేసింది. అనూహ్యంగా ఊహాగానాల్లో వినిపించని పేరు తెరపైకి వచ్చి ఆశ్చర్యపరిచింది. అయితే రాధాకృష్ణన్ ఎంపిక వెనుక బీజేపీకి చాలా వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది.
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్డీఏ కూటమి-ఇండియా కూటమి మధ్య హోరాహోరీ ఫైటింగ్ సాగేలా ఉంది. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుంటే... ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇలా ఇరు పక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
Bandi Sanjay: మర్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మర్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. ‘‘మర్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదు.
తెలంగాణలో ఏ పార్టీ అయినా... అధికారంలోకి రావడానికి రిజర్వ్డ్ నియోజకవర్గాలు చాలా ముఖ్యం. ఇక్కడ 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈసారి పునర్విభజన జరిగితే... ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.