సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీజేపీ మహిళా అభ్యర్థులపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.
అనపర్తి నుంచి టీడీపీ అభ్యర్దిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన తరువాత ఆ సీటు బీజేపీకి కేటాయించారు. ఈ క్రమంలోనే ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో బీజేపీ నేతల మంతనాలు జరుపుతున్నారు. బీజేపీలో చేరాలని ఆయనను ఆహ్వానిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది 5 గ్యారంటీలు కాదు ఐదు మోసాలు, ఐదు అబద్ధాలు అని విమర్శలు గుప్పించారు.
మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా కుల నిర్ధారణ సర్టిఫికెట్ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. నవనీత్ రాణా 2019లో ఎస్సీ కేటగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచింది. కాకపోతే ఈ విషయంలో నవనీత్ రానా అందించిన ఎస్సీ సర్టిఫికెట్లు సరైనవి కాదని కొందరు బాంబే హైకోర్టులో కేసు వేశారు. ఈ విషయం సంబంధించి అప్పట్లో అయితే చర్చ జరిగింది. ఇందులో భాగంగానే కోర్టు ఆవిడకు రెండు లక్షల జరిమానాను కూడా విధించింది.…
అంబర్ పేట్ నియోజకవర్గం కాచిగూడ డివిజన్ పర్యటనలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 13వ తేదీన తెలంగాణలో లోక్ సభలో ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రంలో మాదిరిగానే కేంద్రములో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని రాష్ట్ర మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. 10 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వాలు మారడం ఆనవాయితీ అని అన్నారు.