బీజేపీ మత రాజకీయాలు తప్ప రాష్ట్రాభివృద్ధికి చేసింది శూన్యమని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
సమిష్టిగా కృషిచేసి తెలుగుదేశాన్ని గెలిపించాలని నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరి మండల కేంద్రంలోని కళ్యాణ మండపం నందు సీతారాంపురం ఉదయగిరి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులు, బీజేపీ నాయకులతో సమీక్ష సమావేశంతో పాటు పరిచయ కార్యక్రమాన్ని ఉదయగిరి మండల కన్వీనర్ బయన్న, సీతారాంపురం మండల కన్వీనర్ ప్రభాకర్ రాజులు నిర్వహించారు.
JP Nadda: ప్రతిపక్ష ఇండియా కూటమిని టార్గెట్ చేసుకుంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. ఇండియా కూటమి ‘వంశపారంపర్య పార్టీల’ కూటమిగా అభివర్ణించారు. ఈ కూటమిలోని సగం మంది నాయకులు జైల్లో ఉంటే, మరో సగం మంది బెయిల్‌పై ఉన్నారని అన్నారు.
విశ్వేశ్వరెడ్డి, రంజిత్ రెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా వ్యవహరించారని.. రంజిత్ రెడ్డి అయితే మరీ దారుణంగా మోసం చేశాడని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. మహేందర్ రెడ్డి భార్య వికారాబాద్‌లో ఆనంద్ ను ఓడిపోయేలా చేశారని విమర్శించారు మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కలిసి పరిగి సమావేశంలో డ్రామాలు చేశారు.
Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై అధికార డీఎంకే పార్టీపై విరుచుకుపడ్డారు. కోయంబత్తూర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఆయన ఈ రోజు భారీ రోడ్ షో నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, బాక్సర్ విజేందర్ సింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు కోర్టులో వాదనలు జరిగాయి. బుధవారం కేజ్రీవాల్ ఈడీపై విరుచుకుపడ్డారు.
మంత్రి అతిషికి డిఫమేషన్ నోటీసు పంపామని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ చెప్పారు. తనను ఎవరు ఆశ్రయించారు.. ఎప్పుడు ఆ ఘటన జరిగింది.. దానికి సంబంధించిన సాక్ష్యాలను అతిషి ఇవ్వలేకపోయినట్లు ఆయన ఆరోపణలు చేశారు.
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్ మోడీ ఇవాళ (బుధవారం) సంచలన ప్రకటన చేశారు. తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు.